#HanuManRAMpage :‘హనుమాన్’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అన్ని కోట్లా? నైజాం రికార్డ్

By Surya PrakashFirst Published Jan 27, 2024, 12:23 PM IST
Highlights

తొలుత హనుమాన్‌కు తక్కువ థియేటర్లు ఇచ్చిన తర్వాత సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో థియేటర్ల సంఖ్యను పెంచాల్సి వచ్చింది. సంక్రాంతి వెళ్లి 15 రోజులు అవుతున్నా  హనుమాన్ కలెక్షన్ల సునామీ ఆగడం లేదు.


 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన సినిమాల్లో ఒకటైన హనుమాన్  ఏ రేంజిలో దుమ్ము దులుపుతోందో తెలిసిందే. చిన్న సినిమా గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు పెద్ద సినిమాగా మారింది. ఈ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటించిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయ్యింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన  ఈ సినిమా అన్ని చోట్లా భారీగానే వర్కవుట్ అయ్యింది. అఫీషియల్ సినిమా నిర్మాతలు ప్రకటించిన దాని ప్రకారం వరల్డ్ వైడ్ కలెక్షన్లు  250 కోట్ల మార్క్ దాటాయి.   

 సినిమా నైజాం హక్కుల కోసం మైత్రీ మూవీస్ భారీ మొత్తం వెచ్చించడం విశేషం. హనుమాన్ మూవీ నైజాం హక్కులను మైత్రీ మూవీస్ ఏకంగా రూ.7.2 కోట్లకు దక్కించుకుంది.. ఓ చిన్న సినిమాకు ఇది చాలా పెద్ద మొత్తమే అయినా ధైర్యం చేసినందుకు ఫలితం కనపడుతోంది. నైజాంలో ఈ సినిమా ర్యాంపేజ్ కంటిన్యూ అవుతోంది. రిపబ్లిక్ డే రోజు కూడా ₹2.2 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఇప్పటిదాకా నైజాంలో గ్రాస్ ₹52.5 Cr షేర్ (జీఎస్టీ లేకుండా) ₹27.24 Cr వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగురెట్లు లాభం ఇప్పటిదాకా వచ్చింది. 

Latest Videos

అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ హనుమాన్ ఏకంగా రూ.23 కోట్ల బిజినెస్ చేసింది. ఈ మూవీ నుంచి గతంలో వచ్చిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సంక్రాంతి బరిలోని పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన భారీ సినిమా, దానికి సంబంధించిన విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. తొలుత హనుమాన్‌కు తక్కువ థియేటర్లు ఇచ్చిన తర్వాత సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో థియేటర్ల సంఖ్యను పెంచాల్సి వచ్చింది. సంక్రాంతి వెళ్లి 15 రోజులు అవుతున్నా  హనుమాన్ కలెక్షన్ల సునామీ ఆగడం లేదు.

తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంటోంది.    హనుమాన్ సినిమా భారతీయ భాషలైన తెలుగు, హిందీ, మరాఠీ,తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లోనూ రిలీజ్ అవటం విశేషం. ఈ మూవీని నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. హరి గౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు. 

click me!