రవితేజ ‘ధమాకా’ నుంచి మాస్ ధావత్.. రిసౌండింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

Published : Sep 21, 2022, 12:48 PM ISTUpdated : Sep 21, 2022, 12:54 PM IST
రవితేజ ‘ధమాకా’ నుంచి మాస్ ధావత్.. రిసౌండింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

సారాంశం

మాస్ మహారాజ్ రవితేజ వరుస చిత్రాలతో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ (Dhamaka) నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందింది.

వరుస చిత్రాలతో మాస్ మహారాజా ఫ్యాన్స్ కు, ఆడియెన్స్ కు రవితేజ కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు. ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా నటిస్తున్న తాజా చిత్రం  ‘ధమాకా’ (Dhamaka)ను కూడా రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. గతేడాది ప్రారంభమైన ఈ చిత్రం హైదరాబాద్ మరియు స్పెయిన్ లో చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్  తుది దశలో ఉన్నట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి క్రేజీ అప్డేట్స్ అందిస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ‘ధమాకా’ నుంచి ‘మాస్ ధావత్’ అంటూ కొత్త అప్డేట్ ను అందించారు. 

ఇప్పటికే చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. మూవీ పోస్టర్స్, గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మాస్ ధావత్ అంటూ మరోసాంగ్ రిలీజ్ కు టైం ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 23న ‘మాస్ రాజా’ (Mass Raja) టైటిల్ తో సాలిడ్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతనెలలో ‘జింతాక్’ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలోనే చిత్రం విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయనున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’తో నిరాశ పరిచిన రవితేజ ఈ మూవీతో అదరగొడుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రవితేజ - శ్రీలా హీరోహీరోయిన్లు నటిస్తున్న చిత్రం ‘ధమాకా’. దర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన డైరెక్ట్ చేస్తున్నారు. యాక్ష‌న్ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న మూవీ ప్రస్తుతం తుది దశ షూటింగ్ లో ఉంది. చిత్రానికి ప్ర‌స‌న్న‌ కుమార్ బెజ‌వాడ క‌థ, స్క్రీన్ ప్లే, మాటలు అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్‌, వివేక్ కూచిబొల్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక రవితేజ లైనప్ లో ‘రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు, మట్టి కుస్తీ’ చిత్రాలున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?