ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత..

By Sumanth KanukulaFirst Published Sep 21, 2022, 10:51 AM IST
Highlights

ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.


ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. రాజు శ్రీవాస్తవ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఆగస్టు 10వ తేదీన రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆయనకు యాంజియోప్లాస్టీ చేసి వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే రాజు శ్రీవాస్తవ ఈరోజు ఉదయం 10.20 గంటలకు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

‘‘రాజు శ్రీవాస్తవ ఇక లేడని అరగంట క్రితం కుటుంబం నుండి నాకు కాల్ వచ్చింది. ఇది నిజంగా దురదృష్టకరమైన వార్త. అతను 40 రోజులకు పైగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు’’ అని రాజు శ్రీవాస్తవ సోదరుడు డిపూ శ్రీవాస్తవ ఏజెన్సీకి తెలిపారు.

టీవీ ఇండస్ట్రీలో రాజు శ్రీవాస్తవకు మంచి గుర్తింపు ఉంది. శ్రీవాస్తవ 1980ల నుంచి ఎంటైర్ ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే 2005లో స్టాండ్-అప్ కామెడీ షో ‘‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌’’లో పాల్గొన్న తర్వాత మాత్రమే గుర్తింపు పొందారు.దేశంలోని అత్యంత విజయవంతమైన స్టాండ్-అప్ కమెడియన్‌లలో రాజు శ్రీవాస్తవ కూడా ఒకరు. అనేక మంది రాజకీయ నాయకులను అనుకరించడం ద్వారా రాజు శ్రీవాస్తవ ప్రజాదరణ పొందారు. 

 

 

కమెడియన్ రాజు శ్రీ వాస్తవ కన్నుమూత..!

pic.twitter.com/x7OrMUfdFH

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 

అలాగే మైనే ప్యార్ కియా, బాజీగర్, బాంబే టు గోవా.. వంటి హిందీ చిత్రాలలో కనిపించారు. అతను బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్‌గా పనిచేశారు.

click me!