దిల్‌రాజు రిలీజ్‌ చేస్తున్నాడంటే సినిమాలో స్టఫ్‌ ఉన్నట్టే.. `మసూద`కి దశ తిరిగినట్టే !

Published : Nov 09, 2022, 08:34 PM IST
దిల్‌రాజు రిలీజ్‌ చేస్తున్నాడంటే సినిమాలో స్టఫ్‌ ఉన్నట్టే.. `మసూద`కి దశ తిరిగినట్టే !

సారాంశం

నిర్మాత దిల్‌రాజు చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. కంటెంట్ నచ్చి `మసూద` అనే చిత్రాన్ని తన బ్యానర్‌పై విడుదల చేయబోతున్నారు. దీంతో ఆ సినిమా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సినిమాలో కంటెంట్‌ ఉంటే అది ఆడియెన్స్ ని రీచ్‌ అయ్యేందుకు అనేక దారులు ఓపెన్‌ అవుతుంటాయని అంటున్నారు. అలా బడా డిస్ట్రిబ్యూటర్‌ చేతిలో పడితే దాని దశ తిరిగినట్టే. తాజాగా `మసూద` అనే మూవీ అలాంటి అదృష్టాన్నే దక్కించుకుంది. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు విడుదల చేయబోతుండటం విశేషం. సినిమా కంటెంట్‌ నచ్చిన దిల్‌రాజు ఈ చిత్రాన్ని తన ఎస్వీసీ బ్యానర్‌పై డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. 

తాజాగా ఈ విషయాన్ని దిల్‌రాజు వెల్లడించారు. ఈ చిత్ర నిర్మాత రాహుల్‌ యాదవ్‌(స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌) తీసిన రెండు సినిమాలు `మళ్లీరావా`, `ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ`లకు తాను అభిమానిని అని తెలిపారు దిల్‌రాజు.  ``ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`తో స్వరూప్‌ని డైరెక్టర్‌గా, నవీన్ పోలిశెట్టిని హీరోగా పరిచయం చేశాడు. నవీన్‌కి ఆ సినిమా ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే. రాహుల్ అభిరుచిగల నిర్మాత. ఆ రెండు సినిమాల జర్నీ నాకు నచ్చి.. అప్పుడే రాహుల్‌కి మాటిచ్చాను.. తర్వాత ఏదైనా సినిమా ఉంటే.. నువ్వు నిర్మించిన తర్వాత మా ద్వారా రిలీజ్ చేద్దాం అని చెప్పాను.

ఆయన నిర్మించిన ‘మసూద’ చిత్రాన్ని మా ఎస్‌విసి ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా టీజర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. టీజర్ చూడగానే రాహుల్‌కి ఫోన్ చేసి చెప్పాను. ఈ సినిమాతో కూడా కొత్తవారిని పరిచయం చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా చూడబోతున్నాను. ఫైనల్ కాపీ చూసేందుకు ఐయామ్ వెయిటింగ్. రాహుల్‌తో అసోసియేట్ అవడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. నవంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చెప్పారు దిల్‌రాజు. 

చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ..`దిల్‌ రాజుగారిది చాలా మంచి చెయ్యి. నాది కూడా మంచి చెయ్యి. రెండు మంచి చేతులు కలిస్తే గట్టిగా సౌండ్ వస్తుందని భావిస్తున్నాను. `మసూద` మూడు సంవత్సరాల కష్టమిది. మధ్యలో కోవిడ్ రావడంతో ఆలస్యమైంది. మొదటి నుంచి నేను చెబుతున్నట్లుగా.. కొత్త డైరెక్టర్స్‌ని 5గురుని పరిచయం చేస్తున్న తరుణంలో.. ఇప్పుడు 3వ దర్శకుడు సాయికిరణ్‌ని పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకి ఎందరో టాలెంటెడ్ పర్సన్స్ వర్క్ చేశారు. మధ్యలో వేరే అవకాశాలు వచ్చినా వెళ్లకుండా.. ఈ సినిమా కోసం 3 ఇయర్స్ కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాకీ అవకాశం ఇచ్చిన రాజుగారికి థ్యాంక్స్. ఆయన నమ్మకం నిలబెట్టుకుంటాననే హోప్ అయితే నాకుంది. బుధవారం సాయంత్రం సోనీ మ్యూజిక్ ద్వారా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నాం` అని చెప్పారు. 

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించిన ‘మసూద’ చిత్రానికి సాయికిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నారు. తిరువీర్‌, కావ్యకళ్యాణ్‌రామ్‌, బాందవిశ్రీధర్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. హారర్-డ్రామా ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌