Bigg Boss Telugu 6: ఇది రెజ్లింగ్ కాదు రేవంత్... ఆదిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!

Published : Nov 09, 2022, 06:27 PM IST
Bigg Boss Telugu 6: ఇది రెజ్లింగ్ కాదు రేవంత్... ఆదిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!

సారాంశం

 బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్క్ నడుస్తున్నాయి. దీంతో కంటెస్టెంట్స్ మధ్య బలప్రయోగం జరుగుతుంది. మైండ్ గేమ్స్ లోనే అగ్రెసివ్ గా ఉండే రేవంత్ మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. 

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా నాగమణులు గేమ్ నిర్వహించాడు బిగ్ బాస్. ఈ గేమ్లో ఒక టీమ్ సభ్యులు తమ వద్ద ఉన్న నాగమణులు కాపాడుకోవాలి. మరొక టీమ్ సభ్యులు వారి వద్ద నుండి బలవంతంగా లాక్కోవాలి. ఈ ఫిజికల్ టాస్క్ తోపులాటలకు, గొడవలకు కారణం అవుతుంది. రేవంత్ గేమ్ చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. కంటెస్టెంట్స్ తో అతనికి గొడవలు అవుతున్నాయి. కీర్తి తనను గుద్దాడని కంప్లైంట్ చేసింది. ఫైమా ఎత్తి పడేశాడని చెప్పింది. 

బాల ఆదిత్య, శ్రీసత్య కూడా రేవంత్ గేమ్ పై కంప్లైంట్ చేశారు. ఆదిరెడ్డితో అయితే మొదటి నుండి వాగ్వాదం నడుస్తుంది. గేమ్ మాత్రమే ముఖ్యం కాదు, దెబ్బలు తగలకుండా ఆడు అని ఒకటికి రెండు సార్లు చెప్పాడు. రేవంత్ ఎవరు చెప్పినా వినడం లేదు. నాగమణులు సేకరించేటప్పుడు, కాపాడుకునేటప్పుడు రేవంత్ ఫిజికల్ అవుతున్నాడని పలువురు ఆరోపించారు. 

ఆదిరెడ్డి రేవంత్ కాలు పట్టుకొని లాగాడు. అది రేవంత్ తప్పుబట్టారు. కాలు పట్టుకొని లాగడం ఫిజికల్ కాదా? ఇకపై నాకు గోరు తగిలినా ఫిజికల్ అవుతా అన్నాడు. దానికి ఆదిరెడ్డి ఇదేమి రెజ్లింగ్ కాదు. గేమ్ లో ఫిజికల్ అవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. దానికి నువ్వు నామినేషన్ పాయింట్ వెత్తుక్కో అని ఆదిరెడ్డిని రేవంత్ అన్నాడు. నేను ప్రత్యేకంగా పాయింట్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతి అరగంటకు ఇస్తావు అన్నాడు. 

ఈ వారం నిన్ను నామినేట్ చేస్తా అని రేవంత్ అనగానే.. నామినేషన్ వేసుకో, ఏదైనా చేసుకో. నేను నీలా ఆడను గేమ్ నీట్ గా ఆడతా అని సమాధానం చెప్పాడు. నాగమణులు టాస్క్ మొత్తంగా కంటెస్టెంట్స్ మధ్య మరింత మంట రాజేసింది. ప్రస్తుత కెప్టెన్ శ్రీసత్య  నెక్స్ట్ ఎవరు అవుతారనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ వారం మొత్తం 9 మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. గత ఆదివారం గీతూ ఎలిమినేట్ అయ్యింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్