
అడివి శేష్ హీరోగా నటించిన `హిట్ 2` టీజర్ ఇటీవల విడుదలై ట్రెండ్ అవుతుంది. కానీ అంతలోనే యూట్యూబ్ బిగ్ షాకిచ్చింది. టీజర్‌ని యూట్యూబ్ నుంచి తొలగించింది. టీజర్ వచ్చాక నాలుగు రోజులకు ఈ టీజర్‌ని యూట్యూబ్ నుంచి తొలగించడం ఇప్పుడు సంచలనంగా మారింది. క్రైమ్ సీన్లు శృతి మించినట్టుగా ఉండటంతో యూట్యూబ్ నుంచి టీజర్‌ని తొలగించినట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే తాజాగా దీనిపై హీరో అడివి శేష్ స్పందించారు. తనదైన స్టయిల్‌లో సెటైర్లు వేశారు. దర్శకుడు శైలేష్ కొలను సినిమా టీజర్ చూపించినప్పుడే ఇలాంటి ఓ రోజు వస్తుందని ఊహించా. అనుకున్నట్టుగానే వచ్చింది. ట్రెండింగ్ లిస్ట్ నుంచి మా సినిమా టీజర్‌ని యూట్యూబ్ తొలగించింది. టీజర్ విడుదలైన తర్వాత వరుసగా నాలుగు రోజులపాటు మా వీడియో యూట్యూబ్ ట్రెండింగ్‌లో ప్రథమ స్థానంలో ఉంది. సడెన్‌గా దీన్ని తొలగించి, కేవలం 18ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే చూసేలా పరిమితులు విధించారు. కాబట్టి ఇప్పుడు మీరు మా టీజర్ చూడాలనుకుంటే సైన్ ఇన్ చేసి, 18ఏళ్లు నిండినవాళ్లు అనినిరూపించుకోవాల్సి ఉంటుంది` అడివిశేష్ పేర్కొన్నారు.
ఇక రెండేళ్ల క్రితం వచ్చిన `హిట్`కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని నిర్మించారు. క్రైమ్ కథతో, మరో కేసుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది వైజాగ్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కింది. ఓ యువతి హత్యను ప్రధానంగా చూపించనున్నారు. ఈ హత్యకి సంబంధించిన సన్నివేశాలు ఈ టీజర్‌లో చూపించడమే ఇప్పుడు సమస్యగా మారింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు `హిట్` సిరీస్‌ని ఏడు సినిమాలుగా తీసుకురాబోతున్నారు. ఇక ఇందులో అడివి శేష్ హీరోగా నటించగా, ఆయనకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈసినిమాని డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని `ఊరికే ఊరికే` అనేపాటని రేపు విడుదల చేయబోతున్నారు.