She-Hulk: 'షి - హల్క్' ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉందంటే?

Surya Prakash   | Asianet News
Published : May 19, 2022, 03:56 PM IST
She-Hulk: 'షి - హల్క్' ట్రైలర్  వచ్చేసింది, ఎలా ఉందంటే?

సారాంశం

టటియానా ఈ చిత్రంలో జెన్నీఫర్ వాల్టర్స్ అనే న్యాయవాది పాత్రలో కనిపిస్తుంది. ఆమెకు కూడా అనుకోకుండా హల్క్ తరహా సూపర్ పవర్స్ వస్తే ఏమవుతుందనేది కథ. ‘హల్క్’ అభిమానులు ఆమె బాగానే  ఉందంటున్నారు. 

సూపర్ హీరోస్ సినిమాలు, సీరిస్‌లు అభిమానులకు కొన్ని ఎక్సెపెక్టేషన్స్ ఉంటాయి. అలాంటి వాటికు కేరాఫ్ అడ్రస్.. ‘మార్వెల్ స్టూడియోస్’ నుంచి వస్తోందంటే మరీను. కామిక్ బుక్స్‌లో ఉండే కొత్త సూపర్ హీరోలను పరిచయం చేస్తూ.. ఒక చిత్రంతో మరో చిత్రానికి ఇంటర్  లింక్ పెడుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంపొందించడం ‘మార్వెల్’ ప్రత్యేకత. తాజాగా మార్వెల్ మరో ప్రయోగం చేసింది. అదే.. ‘She-Hulk: Attorney at Law’. ఈ వెబ్ సీరిస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మార్వెల్ సంస్థ యూట్యూబ్‌లో విడుదల చేసింది. అయితే ఈ ట్రైలర్ అనుకున్నంత ఆసక్తిగా లేదని పెదవి విరిచేస్తున్నారు అభిమానులు.

హాలీవుడ్ నటి టాటియానా మాస్లానీ 'షి-హల్క్ '  లీడ్ రోల్ కనిపిస్తుంది. టటియానా ఈ చిత్రంలో జెన్నీఫర్ వాల్టర్స్ అనే న్యాయవాది పాత్రలో కనిపిస్తుంది. ఆమెకు కూడా అనుకోకుండా హల్క్ తరహా సూపర్ పవర్స్ వస్తే ఏమవుతుందనేది కథ. ‘హల్క్’ అభిమానులు ఆమె బాగానే  ఉందంటున్నారు. కానీ, CGI (గ్రాఫిక్స్) వర్క్‌ను మాత్రం ఎవరకీ నచ్చటం లేదు. హల్క్‌గా ఆమె లుక్స్ మరీ దారుణంగా ఉన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వెబ్ సీరిస్‌లో ‘ఇన్‌క్రెడిబుల్ హల్క్’ పాత్ర పోషిస్తున్న మార్క్ రుఫలో కూడా ఉన్నారు.  

షీ-హల్క్‌కు జెస్సికా గావో రచయిత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.  యాక్షన్ కంటెంట్ కంటే కామెడీకే ట్రైలర్ లో ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. బీజీఎమ్  ఇంట్రెస్టింగ్  గా ఉంది.   ట్రైలర్ అయితే ఏమంత ఆసక్తికరంగా లేదు.  ఆమె రూపంపై కూడా ఫన్నీ డైలాగ్స్ ఉన్నాయి. చివరికి జెన్నిఫర్ తన టిండర్ డేట్‌ను తన చేతులతో ఎత్తుకోవడంతో ట్రైలర్ ముగుస్తుంది. 

అలాగే జెన్నిఫర్ హల్క్‌గా మారినప్పుడు.. వేరే వ్యక్తిలా కనిపిస్తోంది, ఆమె రూపు రేఖలే కనిపించడం లేదు.   ఈ వెబ్ సీరిస్ ‘డిస్నీ+’ ఓటీటీలో ప్రసారం కానుంది. ఇప్పటికే డిస్నీలో మార్వెల్‌కు చెందిన ‘ఇది వాండావిజన్’, ‘ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్’, ‘లోకి’, ‘వాట్ ఇఫ్ ఇఫ్…?’ ‘హకీ’, ‘మూన్ నైట్’ సీరిస్‌లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ‘Ms మార్వెల్’ కూడా స్ట్రీమింగ్ కానుంది. ‘షీ-హల్క్’ ఆగస్టు 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద