ప్రభాస్ కి తలనొప్పిగా మారిన మార్వెల్

Published : Feb 12, 2023, 01:18 PM IST
 ప్రభాస్ కి తలనొప్పిగా మారిన మార్వెల్

సారాంశం

పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్‌కి బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడటం లేదు. సాహో, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద కొంత మేర వసూళ్లు రాబట్టినప్పటికీ.. పూర్తిగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి.


  యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మీద చాలా అంచనాలే ఉన్నాయి.  ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించారు.   ఈ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత మొత్తం లెక్కలే మారిపోయాయి. విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఇదేం రామాయణం అంటూ చాలా విమర్శలు వచ్చాయి. ఇదేం గ్రాఫిక్స్ ...అన్నారు.  ఇలా  టీజర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పునరాలోచనలో పడిన ‘ఆదిపురుష్’ రిలీజ్ ని జూన్ 16 కి వాయిదా వేసింది. అప్పటికి మొత్తం మార్పులు,చేర్పులు చేసి శభాష్ అనిపించుకుందానే ప్లాన్ లో ఉన్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది.

జూన్ 16 న మార్వెల్ సినిమాటెక్ యూనివర్శ్ నుంచి ది ప్లాష్ సినిమా రాబోతోంది. ఆ సినిమా ఫుల్ గా గ్రాఫిక్స్ తో నిండి ఉంటుంది. ఒకే రోజు రిలీజ్ అయ్యే ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉంటుందని చెప్పలేం కానీ ఖచ్చితంగా కంపేరిజన్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా భారీ రిలీజ్ కావటంతో .. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ,  USAలో థియేటర్స్ సమస్య ఉంటుంది. దాదాపు అన్ని మేజర్ థియేటర్ చైన్స్ ... ప్లాష్ సినిమాని రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నాయి. అంతేకాదు ఇండియాలో మల్టిప్లెక్స్ లలో స్క్రీన్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఊహించని ట్విస్ట్. 
  
ఇక వీఎఫ్‌ఎక్స్‌, సీజీ వర్క్ కోసం రూ.100 కోట్లని అదనంగా ‘ఆదిపురుష్’ టీమ్ ఖర్చు చేయచేస్తోంది.  జూన్ 16న రిలీజ్ చేయబోతున్నట్లు యూవీ క్రియేషన్స్  ఇప్పటికే ప్రకటించింది. పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్‌కి బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడటం లేదు. సాహో, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద కొంత మేర వసూళ్లు రాబట్టినప్పటికీ.. పూర్తిగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. దాంతో ప్రభాస్ కూడా ‘ఆదిపురుష్’పై గంపెడాశలు పెట్టుకున్నాడు.

 ఈ సినిమాలో రాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?