మహేష్ కాంపౌండ్ లో మారుతి.. ఛాన్స్ కొట్టినట్లే!

By Udayavani DhuliFirst Published 8, Sep 2018, 5:30 PM IST
Highlights

'ఈరోజుల్లో' చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన మారుతి అంచలంచెలుగా  ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'గీతా ఆర్ట్స్' లో చేసిన 'భలే భలే మగాడివోయ్' సినిమాకు అతడికి మంచి బ్రేక్ ఇచ్చింది.

ఆ తరువాత కొంత కాలం పాటు మెగా కాంపౌండ్ లోనే ఉన్న మారుతి ఇప్పుడు అక్కినేని క్యాంపులోకి అడుగుపెట్టి నాగచైతన్య హీరోగా 'శైలజారెడ్డి అల్లుడు' అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత గీతాఆర్ట్స్-యువి క్రియేషన్స్ సంస్థలు నిర్మించే సినిమాకు దర్శకత్వబాధ్యతలు నిర్వహించనున్నారు మారుతి.

తాజాగా ఈ దర్శకుడిగా మహేష్ బాబు కాంపౌండ్ లో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సోదరి మంజుల నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు మారుతి స్వయంగా వెల్లడించారు. అయితే హీరో ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరి ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తాడా ..? లేక మహేషే చేస్తాడా..? అనేది కొద్దిరోజుల్లో తెలియనుంది!  

Last Updated 9, Sep 2018, 2:14 PM IST