
ప్రముఖ మారాఠి నటుడు ప్రదీప్ పట్వర్ధన్ హఠాన్మరణం చెందారు. మంగళవారం ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యలు తెలిపిన వివరాల ప్రకారం ఆయన గుండె పోటుతో చనిపోయారు. ప్రదీప్ ఆకస్మిక మరణంతో మరాఠి చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనీ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఇక నటుడి మృతికి మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రదీప్ పట్వార్థన్ హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. మరాఠి సినీ పరిశ్రమ ఓ లెజెండరి నటుడిని కొల్పోయింది అంటూ... ఏక్ నాథ్ షిండే ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రదీప్ కు వరుసగా నివాళి అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ సంతాపం ప్రకటించారు.
అలాగే మరాఠి ఇండస్ట్రీకి చెందిన సినీ, టీవీ నటీనటులు సైతం ప్రదీప్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రదీప్ పట్వర్థన్ చిన్న స్థాయి నుంచి అంచెలంచలుగా ఎదిగి.. తనదైన నటనతో..స్టార్ యాక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. మరాఠి పరిశ్రమలో ఆయన లెజండరీ యాక్టర్ . ముఖ్యంగా ఎక్ ఫుల్ ఛార్ హాఫ్, మే శివాజీరాజీ భోంస్లే బోల్తె లాంటి మరాఠి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు పొందారు.
అంతే కాదు రీసెంట్ గా ప్రదీప్ బాలీవుడ్ స్టార్ అనురాగ్ కశ్యప్ బాంబే వెల్వెట్ క్రైం థ్రిల్లర్ మూవీలో కూడా ముఖ్య పాత్రలో నటించి మెప్పించారు. ఇటు సినిమాలతో పాటు అటు మరాఠి సీరియల్స్ లో కూడా ఆయన నటించి ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పును పొందారు.