మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి యంగ్ హీరో.. ఎవరు? ఏ సినిమా?

By team teluguFirst Published Aug 9, 2022, 1:49 PM IST
Highlights

మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో యంగ్ హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ రొమాంటిక్ గా ఉంది. 

మాస్ మహారాజా రవితేజ అభిమానులకు మరో యంగ్ హీరో దొరికేశాడు. రవితేజ ఫ్యామిలీ నుంచి కుర్రహీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇంతకీ ఆయన యంగ్ హీరో ఎవరు.? ఎలాంటి చిత్రంతో రాబోతున్నాడనే డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు (Madhav Bhupathiraju) యంగ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. 

మాధవ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో సినిమా నిర్మిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఏయ్... పిల్లా’ (Ey Pilla) అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. టైటిల్ క్యాచీగా ఉండటంతో యువతను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. చుట్టూ నీళ్లు మధ్యలో హీరోహీరోయిన్లు ఒకరి కండ్లలోకి ఒకరు ప్రేమతో చూసుకోవడం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తే కచ్చితంగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందించేలా ఉందని తెలుస్తోంది. 

ఈ సందర్భంగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 'హృదయానికి హత్తుకునే ఓ అందమైన ప్రేమకథా చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుభూతినిస్తుంది. వింటేజ్ ప్రేమకథగా 90ల నేపథ్యంలో రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. 

చిత్రంలో హీరోయిన్ గా మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ నటిస్తోంది. కథానాయికగా ఆమెకూ ఇది తొలి చిత్రమే.  ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తుండగా..  లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  

 

Hi everyone,
Here is the first look of my debut film

Produced by bujji garu
Directed by ludheer 🎬
Music by 🎶🎻

Super excited 🎉🎉🎉 pic.twitter.com/kZlfiv2eQK

— maadhav bhupathiraju (@maadhav_9999)
click me!