Prema Entha Madhuram: కొంప మునిగే ప్లాన్ చేసిన మాన్సీ.. ఆర్యకు పొంచి ఉన్న ప్రమాదం?

Published : Mar 15, 2023, 06:59 AM IST
Prema Entha Madhuram: కొంప మునిగే ప్లాన్ చేసిన మాన్సీ.. ఆర్యకు పొంచి ఉన్న ప్రమాదం?

సారాంశం

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల హృదయాన్ని దోచుకుంటుంది. భార్యాభర్తల బంధానికి ప్రతీక గా ఉంది ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చ్ 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

నా కష్టాల్లో పాలుపంచుకోవాలని భార్యగా నీకు కూడా ఉంటుంది కదా అందుకే నాకు చెప్పకుండా ఉండి ఉంటావు. అప్పుడు ఆఫీసు వరకు షేర్ చేసుకొని హెల్ప్ చేశావు ఇప్పుడు పనిచేసి నా బాధ్యతని పంచుకుంటున్నావు ఇందులో ప్రేమ తప్పితే వేరే ఏమీ కనిపించడం లేదు అంటాడు ఆర్య. నేను వంట పని చేస్తున్నానని తెలిసి అవమానంగా ఫీల్ అవ్వలేదు.

పైగా నా మనసులో మాట తెలుసుకున్నారు అంటూ ఆనంద పడిపోతుంది అను. ఒకరినొకరు అర్థం చేసుకోవటం లోని ఏ బంధమైనా నిలిచి ఉంటుంది. నువ్వు చేసిన పనికి నాకు నామోషీగా లేదు కానీ నువ్వు ఉన్న పరిస్థితుల్లో పనిచేయటమే నాకు కష్టంగా ఉంది అంటాడు ఆర్య. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు వంట తప్పితే ఏ పని చెప్పరు. నాకు ఏ ఇబ్బంది లేనంతవరకు పని చేస్తాను సార్ అంటుంది అను.

అందుకు ఒప్పుకుంటాడు ఆర్య.  మరోవైపు గుడికి వస్తూ నాకు దేవుడు మీద నమ్మకం లేదు నీకోసమే వస్తున్నాను అని ఫ్రెండ్ తో చెప్తుంది మాన్సీ. మనకి కావలసింది మనమే సాధించుకోవాలి దేవుడు ఏం చేస్తాడు అని ఫ్రెండ్ తో చెప్తుంది మాన్సీ. ఇంతలోనే అక్కడ ఉన్న అనుని చూసి దేవుడు అడక్కుండానే వరం ఇచ్చాడు అనుకుంటూ అను దగ్గరికి వెళ్తుంది.

ఇక్కడ ఉన్నావేంటి అను, సారీ అప్పు కదా, అంతేనా ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా, అయినా ఇక్కడ ఏం చేస్తున్నావు. గుడిలో ప్రసాదం తిని కడుపు నింపుకుందామనా, గుడిలో కూడా స్టేటస్ ని బట్టి ఎంట్రీ పెడితే బాగుండు లేకపోతే ఇలాగే ఎవరు పడితే వాళ్ళు వచ్చి కూర్చుంటారు అంటుంది మాన్సీ. దేవుడు అందరినీ సమానంగా చూడాలని చూస్తుంటాడు అంటుంది  అను.

ఏంటి సెటైర్లు వేస్తున్నావా అంటుంది మాన్సీ. లేదు, కుళ్ళు కుతంత్రాలతో ఉండే వాళ్ళకి గుడిలో కూడా ప్రశాంతత దొరకదు మంచి వాళ్ళకి చెట్టు కింద కూర్చున్న ప్రశాంతత దొరుకుతుంది అంటుంది అను. చెప్పే ఓపిక నీకున్న వినే ఓపిక నాకు లేదు. చేత కానప్పుడు ఇలాంటి సూక్తులే మాట్లాడుతారు, మీ బ్రతుకులు ఫుట్పాత్ మీదకి రాకుండా చూసుకో, విష్ యు బ్యాడ్ లక్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాన్సీ.

ఇదంతా దూరం నుంచి చూస్తున్న అను వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఆ మహాతల్లి ఇక్కడికి ఎందుకు వచ్చింది నిన్ను ఏదో అంటుంది ఏంటి అని అడుగుతుంది. తన గురించి తెలిసిందే కదా వదిలేయ్ అంటుంది అను. అదే సమయంలో అమ్మవారికి కట్టిన చీరని వేలం వేస్తారు గుడి వారు. వేలంపాటిని వెయ్యి రూపాయలకి ప్రారంభిస్తారు. అను వాళ్ళ అమ్మ అక్కడికి తీసుకువెళ్లి 1500 కి పాడుతుంది.

ఎందుకమ్మా అంత ఖరీదు అంటే ఇది దేవుడి ఆశీర్వచనం అంటుంది అను వాళ్ళ అమ్మ. అందులో మాన్సీ వచ్చి ₹10,000కి పాడుతుంది. అంతలోనే అక్కడికి వచ్చిన అంజలి, అపర్ణ తరఫున 15000 అంటుంది అంజలి. అంజలి అంటుంది.. మాన్సీ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా నీకు కాంపిటేషన్ వస్తున్నాను అనుకుంటున్నావా, కాదు కేవలం అప్పు కోసం మాత్రమే.

వాళ్ళ అమ్మ తనకోసం ఇవ్వాలనుకుంది కుదరలేదు ఒక సిస్టర్ లాగా నేను ఇస్తాను అంటుంది అంజలి. అయినా కూడా 20,000కి పాట పాడుతుంది మాన్సీ. అలా పాడుకుంటూ ఆ చీరని 50 వేల వరకు తీసుకువెళ్తారు వద్దు మేడం అంత రేటు ఉంటుంది అను. డబ్బు కంటే అమ్మ సెంటిమెంటు ముఖ్యం. దానికి వెలకట్టలేము అంటుంది అంజలి.

అలా ఆ పాట లక్ష 25 వేలకి పాడుతుంది అంజలి. అంతకన్నా ఎక్కువ పాడదాం అనుకుంటుంది మాన్సీ కానీ నీరజ్ పెట్టిన కండిషన్ గుర్తొచ్చి ఆగిపోతుంది. వేలంలో గెలిచినందుకు పంతులుగారు ఆ చీరని అను చేతిలో పెట్టి ఆశీర్వదిస్తారు. మాన్సీ దగ్గరికి వెళ్లి టేక్ ఇట్ ఈజీ, అప్పు కడుపుతో ఉంది కదా ఆ చీర కట్టుకుంటే అమ్మవారి ఆశీర్వచనం లాగా ఫీల్ అవుతుంది అని నచ్చ చెప్తుంది అంజలి.

క్యాచ్ యు లేటర్ అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాన్సీ. మీది చాలా మంచి మనసు మీరు సంతోషంగా ఉండాలి అంటూ దండం పెడుతుంది అంటుంది అను తల్లి. మీరు పెద్దవారు అలా దండం పెట్టకూడదు. అప్పు నన్ను చాలా బాగా చూసుకుంటుంది తనకోసం ఆ మాత్రం చేయలేనా అంటుంది అంజలి. అక్కడ ప్రసాదాలు పెడుతున్నారు వెళ్లి స్వీకరించండి అని పంతులుగారు అనటంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

అంజలి పంతులు గారికి రెండు లక్షలు ఇస్తుంది. ఇంత ఎందుకమ్మా అంటే అన్నదానానికి ఉపయోగించండి అంటూ అనుని వాళ్ళ అమ్మ గారిని కూడా తనతో తీసుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు ప్రీతికి ఫోన్ చేసిన మాన్సీ, యాదగిరి తో మాట్లాడావా అని అడుగుతుంది. లైన్లోకి తీసుకుంటాను మీరే మాట్లాడండి అంటూ లైన్ కలుపుతుంది. మాన్సీ మేడం లైన్లో ఉన్నారు మీరు మాట్లాడండి అని యాదగిరికి చెప్తుంది ప్రీతి.

ఏంటి మేడం ఈ యాదగిరి ఫోన్ చేశారు అంటే నాకు ఒక పని చేసి పెట్టాలి అంటుంది మాన్సీ. మర్డర్ తప్ప ఏ పనైనా చేస్తాను అంటాడు యాదగిరి. నువ్వు అంత పని చేయక్కర్లేదు చిన్న మోసం చేస్తే సరిపోతుంది అంటుంది మాన్సీ. ఎవరిని మేడం అని నవ్వుతూ అడుగుతాడు యాదగిరి. మీ అంజలి మేడంని అంటుంది మాన్సీ. ఒక్కసారిగా షాక్ అవుతాడు యాదగిరి.

నీ టాలెంట్ కి తగిన జీతం, వ్యాల్యూ ఇవ్వటం లేదు కాబట్టి నువ్వు ఈ పని చేయటంలో తప్పులేదు అంటుంది మాన్సీ. నిజమే కానీ మీరు ఎందుకు అంజలి మేడంని అని ఏదో ప్రశ్నించే లోపు, ఎందుకు, ఏంటి అని ప్రశ్నించకుండా పనిచేస్తే నీ అకౌంట్లో 50 లక్షలు పడతాయి అంటుంది మాన్సీ. ఏమంటున్నారు మేడం, నిజమేనా అంటూ కంగారు పడిపోతాడు యాదగిరి.

వెంటనే మాన్సీ ప్రీతికి చెప్పి యాదిగిరి అకౌంట్లో 10 లక్షలు వేయిస్తుంది. అది చూసి మళ్ళీ షాక్ అయిపోతాడు యాదగిరి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే పని అయ్యాక నేను చెప్పిన అమౌంటు నీ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు చెప్పు నేను చెప్పిన పని చేస్తావా అంటుంది మాన్సీ. మీరు క్యాష్ తో కొట్టాక చేయకుండా ఎలా ఉంటాను అంటాడు యాదగిరి.

గవర్నమెంట్ కి సంబంధించిన భూమిని ఆక్రమించి కట్టినట్టుగా బ్లూ ప్రింట్ ని మార్చేయాలి, అంతేకాకుండా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లో సిమెంటు కల్తీ జరుగుతున్నట్లుగా క్రియేట్ చేయాలి అంటుంది మాన్సీ. మీరు చాలా ఈజీగా చెబుతున్నారు కానీ ఆనంద్ గాడిని తలుచుకుంటేనే తడిచిపోతుంది. వాడు ఏమాత్రం పసికట్టినా కేల్ కతం, దుకాణ్ బంద్ అంటాడు యాదగిరి.

టెన్షన్ పడకు ఇదంతా అతని మెడకు చుట్టుకునేలాగా ప్లాన్ చేయు అంటూ సలహా ఇస్తుంది మాన్సీ. అలాగే అంటూ ఆనందపడుతూ ఫోన్ పెట్టేస్తాడు యాదగిరి. ఇలాంటి కన్నింగ్ ఫెలోస్ ఉన్నంతవరకు నాలాంటి వాళ్ళకి రివేంజ్ తీర్చుకోవడం ఈజీ అవుతుంది అనుకుంటుంది మాన్సీ. మరొకవైపు సైట్ ని పరిశీలిస్తూ బ్లాస్టింగ్ కి ఈ మాత్రం స్పేస్ ఉండాలి అనుకుంటుంది మాన్సీ.

అంతలోనే అక్కడికి ఒక వ్యక్తి రావడంతో కంగారుపడి ఎవరు నువ్వు అని అడుగుతుంది జలంధర్ జైలుమేట్ ని. నా పేరే బాంబుల బాబ్జి అంటాడు అతను. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు డేంజరస్ అని. జలంధర్ అంతా చెప్పాడు కదా అంటుంది మాన్సీ. తెలుసు మేడం వాళ్ళు బండలు పెంచటానికి డైనమిట్స్ అరేంజ్ చేస్తే నేను వాటిని కూలీల మధ్యలో పేలే లాగా చేయాలి అంతే కదా అంటాడు అతను.

అంతే కదా అని తేలిగ్గా తీసి పారేయకు. అక్కడ బాంబులు మోతలు కన్నా చావు కేకలే ఎక్కువగా వినిపించాలి అంటుంది మాన్సీ. బ్లాస్టింగ్ అయిపోయాక వచ్చి శవాలు లెక్క పెట్టుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాబ్జి. అంజలి మా బ్రో ఇన్ లా హెల్ప్ తో మరొక కొత్త ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశావు. కానీ ఫస్ట్ డే రోజే లాస్ట్ డే అవుతుంది అనుకుంటుంది మాన్సీ.

మరోవైపు బయటికి వెళ్తున్న ఆర్య కి హారతిస్తుంది అను. ఈ ఫార్మాలిటీస్ ఏంటి అని అడుగుతాడు ఆర్య. ఏదైనా పని ప్రారంభించే ముందు  ఈ ఫార్మాలిటీస్ తప్పవు అంటు హారతి  ఇస్తుంది అను. ఈలోపు అక్కడికి వర్కర్ల అందరూ మేము రెడీ అంటూ వస్తారు. ఇంతలో అంజలి ఫోన్ చేసి మీరందరూ బయలుదేరండి నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉంది చూసుకొని వస్తాను అంటుంది.

అక్కడికి వచ్చిన ఒక వర్కర్ మేము కూడా హారతి ఇస్తాము అంటూ హారతి ఇస్తుంది కానీ ఆ హారతి కొండెక్కిపోతుంది. అది చూసిన అను రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయొచ్చు కదా సార్ అని కంగారుగా చెప్తుంది. ఏంటి సెంటిమెంట్ ఫీల్ అవుతున్నావా, అయినా క్వారీ దగ్గర పూజ నిన్నే ప్రారంభమైంది అంటే వర్క్ నిన్నే స్టార్ట్ అయినట్లు ఎప్పటి వర్క్ అప్పుడే ఫినిష్ చేయాలి పోస్ట్ పోన్ చేయకూడదు అంటాడు ఆర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా