రెమ్యూనరేషన్ పై ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే..?

Published : Mar 14, 2023, 11:21 PM IST
రెమ్యూనరేషన్ పై ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే..?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ పై ఓపెన్ అయ్యారు. రోజుకు తాను ఎన్ని కోట్లు తీసుకుంటాడో బహిరంగంగా చెప్పేశారు. సినిమాకు ఆయన ఎన్నిరోజులు పనిచేస్తారో కూడా  వెల్లడించారు పవన్ కళ్యాణ్. 

స్టార్ హీరోల రెమ్యూనరేషన్ పై ఫ్యాన్స్ లో ఆసక్తి ఉంటుంది. సోషల్ మీడియాలో హీరోల రెమ్యూనరేషన్ పై వచ్చే రకరకాల వార్తలతో కన్ ఫ్యూజన్ లో పడిపోతుంటారు ఫ్యాన్స్. అదే ఒక స్టార్ హీరో తన పారితోషికం గురించి ఓపెన్ గా చెప్పేస్తే.. అలాంటి ధైర్యం ఎవరు చేస్తారు అని అనుకోవచ్చు. కాని పవర్ స్టార్ పవలన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ గురించి ఓపెన్ గా చెప్పారు. రోజుకు తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో బహిరంగంగా చెప్పేశారు. 

ప్రస్తుతం రోజుకు  2 కోట్ల పారితోషియం  తీసుకుంటున్నారట పవర్ స్టార్. అంతే కాదు ఆయన సినిమాకు  22 రోజులు పని చేస్తారట. ఈరకంగా ఒక్క సినిమాకు  44 కోట్ల పారితోషికంగా తీసుకుంటాను అని ఓపెన్ అయ్యారు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్. తనపై రాజకీయంగా విమర్షలు చేసేవారికి సమాధానం చెపుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తను డబ్బు కోసం ఆశపడే వాడిని కాదని.. కావాలంటే తానే డబ్బులు ఇస్తానన్నారు. 

మచిలీపట్నంలో జరిగిన జనసేన 10 ఆవిర్భావ సభలో మాట్లాడారు పవన్ కళ్యాణ్. తాను అమ్ముడు పోయాను అనే విమర్షలకు సమాధానం ఇస్తూ.. ఆయన తన రెమ్యూనరేషన్  గురించి మాట్లాడారు. నేను సినిమాలు చేస్తే రోజుకు 2 కోట్లు తీసుకుంటాను. అలాంటప్పుడు నాకు అమ్ముడు పోవల్సిన అవసరం ఏంటీ..? రాజకీయంగా మాటలు పడాల్సి అసవరం నాకు ఏంటీ..? ప్రజలకు మంచి చేయడానికి వచ్చాను. ఇవన్నీ వద్దు అనుకుంటే సినిమాలు చేసుకుంటే హాయిగా ఉండలేనా అంటూ పవన్ తన ప్రసంగంలో  క్లారిటీ ఇచ్చారు. 

అటు పాలిటిక్స్..ఇటు సినిమాలు రెండింటిని బ్యాలన్స్ చేస్తూ.. వెళ్తున్నారు పవర్ స్టార్. ప్రస్తుతం తమిళ మూవీ వినోదయ సితం రీమేక్ లో నటిస్తున్నారు పవర్ స్టార్. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాకు పవర్ స్టార్ 44 కోట్లు తీసుకున్నట్టు ఆయన మాటల్లోనే తెలుస్తోంది. ఇక ఈసినిమాతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో చాలా కాలంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పెండింగ్ లో ఉంది. ఈ సినిమాలతో పాటు క్రిష్ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది.  
 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతి చేసిన కుట్ర, బాలు వద్ద అడ్డంగా దొరికిపోయినా మీనా
ప్రభాస్‌తో చేసిన సినిమాల్లో అనుష్కకు నచ్చిన సినిమా ఏంటో తెలుసా.? అది భలే ఇష్టమట..