
గత కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగా రెగ్యులర్ గా పాత హిట్ సినిమాలని థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది. రీసెంట్ గా రవితేజ సూపర్ హిట్ మూవీ వెంకీ థియేటర్స్ లోకి వచ్చి డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే కిక్ అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు.తాజాగా సమరసింహారెడ్డి చిత్రం కూడా 4కె వెర్షన్స్ లో క్వాలిటీ అవుట్ పుట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. మొదటి రోజు తమ అభిమాన హీరోల సినిమాలు చూడటానికి ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. టాలీవుడ్ కి ఫ్యాక్షన్ ట్రెండ్ ని పరిచయం చేసిన సమరసింహారెడ్డి మూవీ రీరిలీజ్ బాగానే వర్కవుట్ అయ్యిందా?
మరసింహా రెడ్డి సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాత క్రియేషన్స్ వారు రీరిలీజ్ చేశారు. బాగా ఖర్చుపెట్టి 4కె లో అదిరిపోయే క్వాలిటీలో రిలీజ్ కు తెచ్చారు.అయితే అనుకున్న స్దాయిలో రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. మార్చి 2న రిలీజ ఈ రీరిలీజ్ చిత్రాన్ని అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న 3-4 షోలను మినహాయిస్తే మిగతా షోలకు జనం చెప్పుకోదగిన స్దాయిలో లేరు. చెన్న కేశవ రెడ్డి రీ-రిలీజ్ కు వచ్చిన రెస్పాన్స్ లో 10% రాలేదని ట్రేడ్ అంటోంది. వాస్తవానికి రీమాస్టరింగ్ కోసం టీమ్ చాలా డబ్బు ఖర్చుపెట్టారు. క్వాలిటీ బాగన్నా కూడా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇటీవలి కాలంలో ఓయ్ రిలీజ్ మాత్రమే మంచి వసూళ్లు రాబట్టడంతో మిగతా సినిమాలన్నీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకున్న థాకలాలు లేవు. ఇటీవల విడుదలైన కిక్ 4కె వెర్షన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలను ఉర్రుతలూగించిన ఈ చిత్రం బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆ తరువాత ఫ్యాక్షన్ సినిమాలకు శ్రీకారం చుట్టింది. 1999లో సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఫ్యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన సమరసింహారెడ్డి ని విడుదలైన 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమాను ఆయన అభిమానులు 4కె లో విడుదల చేసారు.