మలయాళ సంచలనం `మంజుమ్మల్‌ బాయ్స్` తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

Published : Mar 26, 2024, 07:13 PM IST
మలయాళ సంచలనం `మంజుమ్మల్‌ బాయ్స్` తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

సారాంశం

మలయాళంలో సంచలన విజయం సాధించిన `మంజుమేల్‌ బాయ్స్` మూవీ ఇప్పుడు తెలుగులో రాబోతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు.

మలయాళంలో సంచలన విజయం సాధించింది `మంజుమేల్‌ బాయ్స్`. సస్పెన్స్ థ్రిల్లర్ గా అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ మలయాళ రికార్డులను బ్రేక్‌ చేసింది. సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. మాలీవుడ్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రెండు వందల కోట్లకి దగ్గరలో ఉంది. 

ఇప్పుడు ఈ మూవీ తెలుగులోనూ రాబోతుంది. తెలుగులో డబ్‌ చేయబోతున్నారు. తాజాగా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఏప్రిల్‌ 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. `ఫ్యామిలీ స్టార్‌` రిలీజ్‌ అయిన నెక్ట్స్ డే ఈ మూవీ రాబోతుంది. తెలుగులో దీన్ని `మంజుమ్మల్‌ బాయ్స్`గా రిలీజ్‌ చేస్తుండటం విశేషం. 

ఇటీవల మలయాళ మూవీ `ప్రేమలు` కూడా సంచలన విజయం సాధించింది. ఇది సుమారు 150కోట్ల వరకు వసూలు చేసింది. ఇంకా రన్‌ అవుతుంది. తెలుగులోనూ ఇది పదిహేను కోట్ల వరకువసూళు చేసింది. ఇప్పుడు మరో సంచలనం `మంజుమ్మల్‌ బాయ్స్` రాబోతుండటం విశేషం. ఇందులో అంతా కొత్తవారే నటించారు. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో  కుర్రాళ్లు సౌబిన్‌ శహిర్‌, శ్రీనాథ్‌ భసి, బాలు వర్గేసే, గజపతి ఎస్‌ పోదువాల్‌, లాల్‌ జూ, దీపక్‌ పరంబోల్‌ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. 

`మంజుమ్మల్‌ బాయ్స్` యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఇందులో మంజు మేల్‌ బాయ్స్ అనేది కుర్రాళ్ల టీమ్‌.. వీరంతా కమల్‌ హాసన్‌ అభిమానులు. తమిళనాడులోని గుణ గుహలకి విహారయాత్రకి వెళ్తారు. కమల్‌ నటించిన `గుణ` సినిమా షూటింగ్‌ జరిగిన కేవ్స్ కి ఈ కుర్రాళ్లు వెళ్తారు. అక్కడ ఓ వ్యక్తి డెవిల్స్ కిచెన్‌లో పడిపోతారు. దీంతో మిగిలిన యువకులు తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారనేది కథ.  ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌గా, సీట్‌ ఎడ్జ్ థ్రిల్లర్‌గా సాగుతుంది. 

ఈ సినిమా మలయాళంలో పెద్ద హిట్‌ కావడంతోపాటు అంతా చర్చనీయాంశంగా మారింది. దీంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. తెలుగు ఆడియెన్స్ లోనూ క్యూరియాసిటీ ఏర్పడింది. మరి ఇప్పుడు తెలుగులో రాబోతున్న ఈ మూవీ ఏ రేంజ్‌లో ఆదరణ పొందుతుందో చూడాలి. ఈ మూవీని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ కలిసి డబ్ చేస్తుండటం విశేషం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే