
శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి రచ్చ రచ్చ చేస్తోంది. విదేశాల్లో యాక్టింగ్ నేర్చుకోమని పంపిస్తే ఈ అమ్మడు ప్రేమాయణాలు, డేటింగ్ లు చేస్తూ న్యూస్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈమె రొమాంటిక్ ఫోటోలు బాలీవుడ్ ని ఊపేస్తున్నాయి. జాహ్నవిని హీరోయిన్ గా పరిచయం చేయాలనీ ప్లాన్ చేస్తున్న శ్రీదేవికి .. తన కూతురు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. జాహ్నవి డేటింగ్ విషయం బయట పడటంతో అవకాశాలు రావట్లేదట.
ఇప్పటికే జోరుగా డేటింగ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ భామ సినిమాల్లో ఏం నటిస్తుంది అని వాళ్ళు వీళ్లు అంటున్నారు. దాంతో విసిగి వేసారిన శ్రీదేవి.. తన కూతురుకి గట్టిగానే క్లాస్ పీకిందట.. ఇకపై డేటింగ్ గీటింగ్ అంటూ తిరిగితే కాళ్లు చేతుల విరగ్గొట్టి రూంలో పడేస్తానని కాస్త సీరియస్ గానే చెప్పిందట.!! ఇంతకీ జాహ్నవి డేటింగ్ చేస్తున్నది ఎవరితోనో తెలుసా... ఎవరో కాదు మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో. మరి తల్లి చెప్పినట్టుగా జాహ్నవి మనసు మార్చుకుంటుందో లేక వదులుకోలేక అతనితో చెక్కేస్తుందో మరి.