ఎన్నో కామెడీ చిత్రాలతో అలరించిన అల్లరి నరేష్ ఇటీవల విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. Naresh 62కు సంబంధించిన డిటేయిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఒకప్పుడు స్టార్ హీరోలను మించి సినిమాలు తీశారు అల్లరి నరేష్ (Allari Naresh) . 50కి పైగా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత రూటు మార్చి ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. సీరియస్ సినిమాలతో మెప్పిస్తున్నారు. కంబ్యాక్ తో ప్రయోగాలు చేస్తున్నారు. ‘నాంది’ , ‘ఇట్లు మారేడుమిల్లి’ చిత్రాలతో మెప్పించారు. రీసెంట్ గా ‘ఉగ్రం’ సినిమాతోనూ ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈరోజు నరేష్ పుట్టిన రోజు సందర్భంగా నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేశారు. Naresh 62 వర్క్ టైటిల్ తో ఇంట్రెస్టింగ్ వీడియోను కూడా వదిలారు మేకర్స్ . ‘మూర్ఖత్వం బార్డర్ దాటిన ఒకడి కథ’ అంటూ సినిమాను ప్రకటించారు. అనౌన్స్ మెంట్ తోనే ఆసక్తి పెంచేశారు. మరోవైపు అనౌన్స్ మెంట్ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నరేష్ లుక్ చాలా అగ్రెసీవ్ గా కనిపిస్తోంది. ఓ హోటల్ లో టేబుల్ వద్ద కూర్చొని టీ, సిగరేట్ తాగుతున్న స్టిల్ లో పోస్టర్ ను వదిలారు.
ఈ సినిమా డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిత్రాన్ని ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్ర దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేస్తున్నారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ని నిర్మించిన హాస్య మూవీస్ వారే ఈ చిత్రానికి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో మళ్లీ అల్లరి నరేష్ కామెడీ యాంగిల్ ను చూపించబోతున్నారని తెలుస్తోంది. మరోసారి ఆడియెన్స్ కు వినోదాన్ని అందించబోతున్నారని అంటున్నారు.
చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం దర్శకులు గా వర్క్ చేస్తున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్ గా, రిచర్డ్ సినిమాటోగ్రఫీ గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే చిత్రం రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. బహుశా సెప్టెంబర్ నెలాఖరులో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక మూవీ టైటిల్, హీరోయిన్, స్టార్ కాస్ట్ కు సంబంధించిన డిటేయిల్స్ ను మున్ముందు తెలపనున్నారు.
'Moorkathvam border daatina okadi jeevitha katha'
Happy Birthday to our hero ❤️
Presenting Sitting!
- https://t.co/ll1pPQh2yw
A film by 🎬 … pic.twitter.com/CTIMzI9b0E