అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న రెండో చిత్రం ‘మంగళవారం’. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదలైన ఆకట్టుకుంటోంది. ఈవెంట్ లో డైరెక్టర్ ఈ మూవీ టైటిల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎందుకు ఆ టైటిల్ పెట్టాల్సిందే క్లారిటీ ఇచ్చారు.
దర్శకుడు అజయ్ భూపతి ‘ఆర్ ఎక్స్ 100’తో తన ప్రతిభను చూపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘మహాసముద్రం’ తెరకెక్కించారు. ఇప్పుడు కాస్తా గ్యాప్ తీసుకొని మూడో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రమే ‘మంగళవారం’ (Mangalavaaram). డార్క్ సప్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోందీ చిత్రం. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడటంతో సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. వందరోజుల పాటు అవుట్ డోర్ షూట్ చేసి మంచి అవుట్ పుట్ ను తీసుకున్నారని యూనిట్ తెలుపుతోంది.
ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లు, సాంగ్స్, టీజర్ విడుదలై బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా Mangalavaaram Trailer ను కూడా విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. మరోవైపు అజయ్ భూపతి విజన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక మ్యూజిక్ పరంగానూ అదరగొట్టారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.అయితే ట్రైలర్ ఈవెంట్ లో అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
undefined
అజయ్ భూపతి తన మూడో ప్రాజెక్ట్ టైటిల్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా సరికొత్తగా ఉండబోతోందనే హామీనిచ్చారు. ఇక అసలు చిత్రానికి ‘మంగళవారం’ అనే ఎందుకు పెట్టారో తాజా ఈవెంట్ లో వివరించారు. అజయ్ భూపతి మాట్లాడుతూ చాలా మంది మంగళవారం అంటే ఇప్పటి వరకు ఉన్న సామేతలను, ఘాత వారంగా గుర్తు చేసుకుంటారు. మంచి రోజు కాదని అనుకుంటారు. కానీ వాస్తవానికి మంగళవారం మంచి రోజు. మంగళవారం పూజించే గ్రామీణ దేవతలు చాలా ఉన్నాయి. అలాంటి అంశాలను సినిమాలో చూపించాం. సినిమా చూశాక టైటిల్ ఎందుకు అలా పెట్టాలో పూర్తిగా అర్థం అవుతుంది.. అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో ఎవ్వరూ టచ్ చేయని అంశాన్ని చూపించబోతున్నామని తెలిపారు. ఇక సినిమా 100 రోజుల షూటింగ్ తో పూర్తైందన్నారు.
ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, 'A' క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా అజయ్ భూపతి తొలి చిత్రమిది. దీంతో ఆయన ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించారు. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించింది. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.