బిగ్ అనౌన్స్ మెంట్.. మూడు భాగాలుగా వివేక్ అగ్రిహోత్రి నెక్ట్స్ ప్రాజెక్ట్.. మహాభారతం నుంచి..

By Asianet News  |  First Published Oct 21, 2023, 3:45 PM IST

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రీ బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పట్ల సర్ ప్రైజ్ చేశారు. మూడు భాగాలుగా బిగ్ ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. 
 


‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఫైల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri)  వరుస చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ‘ది వ్యాక్సిన్ వార్’తో కరోనా సమయంలో సైంటిస్టుల కృషిని చూపించారు. ఇక నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్ట్ తో రాబోతున్నారనేది చాలా ఆసక్తిగా మారిన తరుణంలో బిగ్  అనౌన్స్ మెంట్ అందించారు.  తన అఫీషియల్ అకౌంట్  ద్వారా ఈ ప్రకటన చేశారు. 

ది వ్యాక్సిన్ వార్ విడుదలైన తర్వాత చిత్రనిర్మాత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రాన్ని శనివారం ప్రకటించారు. Parva : An  Epic Tale of Dharma గా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని S. L. భైరప్ప కన్నడ నవలకి అనుకరణగా దృశ్యరూపకంగా రాబోతోంది. ఇది మహాభారతం నేపథ్యంలో మూడు భాగాల ఫ్రాంచైజీ చిత్రంగా ఉండనుందని తెలిపారు. ఈ చిత్రాన్ని వివేక్ భార్య, నటి పల్లవి జోషి నిర్మిస్తున్నారు. చిత్రానికి ప్రకాష్ బెలవాడి రచయితగా వ్యవహరిస్తున్నారు. 

Latest Videos

undefined

అయితే ’అన్ని కథలకు మహాభారతం మూలం అని చెప్పారు. ఇది కేవలం పురాణమా? లేక భారతదేశ చైతన్యమా? అనే ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. ఇది చరిత్ర లేదా పురాణామా? అని 17 ఏళ్లపాటు పరిశోధన చేసి పద్మభూషణ్ విజేత ఎస్‌ఎల్ భైరప్ప ఆధునిక క్లాసిక్ పర్వాన్ని రాశారు. ఈ పుస్తకం ఇంగ్లీష్, రష్యన్, చైనీస్ మరియు సంస్కృతంతో సహా అనేక భాషలలోకి ట్రాన్స్ లేట్ చేయబడింది. అన్నిభాషల్లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. కథను పెద్ద తెరపైకి తీసుకొచ్చే బాధ్యత అగ్నిహోత్రి తీసుకున్నారు. అందుకు చాలా గర్వంగానూ, సంతోషంగానూ ఉందన్నారు. ఈ చిత్రం మూడు పార్టులుగా రాబోతుందని, నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. 

వివేక్ నుంచి చివరిగా విడుదలైన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇందులో నానా పటేకర్, అనుపమ్ ఖేర్, రైమా సేన్, సప్తమి గౌడ మరియు పల్లవి జోషి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మోస్తరు స్పందన లభించింది. ఇక వివేక్ తను దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ 2022 కోసం నేషనల్ ఇంటిగ్రేషన్ విభాగంలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నర్గీస్ దత్ అవార్డును అందుకోవడం విశేషం. 

 

BIG ANNOUNCEMENT:

Is Mahabharat HISTORY or MYTHOLOGY?

We, at are grateful to the almighty to be presenting Padma Bhushan Dr. SL Bhyrappa’s ‘modern classic’:
PARVA - AN EPIC TALE OF DHARMA.

There is a reason why PARVA is called ‘Masterpiece of masterpieces’.

1/2 pic.twitter.com/BiRyClhT5c

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri)
click me!