Manchu Vishnu: నిఖిల్ కి మంచు విష్ణు సపోర్ట్.. నేనున్నా తమ్ముడు అంటూ..

By team teluguFirst Published Aug 2, 2022, 3:18 PM IST
Highlights

చాలా కాలంగా కార్తికేయ 2 రిలీజ్ సమస్యలు ఎదుర్కొంటోంది. కోవిడ్ ప్రభావం, ఇతర చిత్రాల విడుదల కారణంగా కార్తికేయ 2 వాయిదా పడుతూ వచ్చింది.

నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చిత్రం కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కొనసాగుతోంది. దేవుడితో లింక్ పెడుతూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కార్తికేయ విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఆగష్టు 12న కార్తికేయ 2 రిలీజ్ కానుంది.

చాలా కాలంగా కార్తికేయ 2 రిలీజ్ సమస్యలు ఎదుర్కొంటోంది. కోవిడ్ ప్రభావం, ఇతర చిత్రాల విడుదల కారణంగా కార్తికేయ 2 వాయిదా పడుతూ వచ్చింది. కార్తికేయ 2 రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రతి సారి..వాయిదా వేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఇటీవల ఇంటర్వ్యూలో నిఖిల్ తెలిపాడు. లేకుంటే థియేటర్స్ ఇవ్వం అని కూడా బెదిరించారని.. ఏం చేయాలో అర్థం కాక ఏడ్చేసినట్లు నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. 

నిఖిల్ కామెంట్స్ కి తాజాగా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించాడు. మంచు విష్ణు ట్వీట్ చేస్తూ..నిఖిల్.. నీకు నేనున్నాను తమ్ముడు.. దృడంగా ఉండు. ఎప్పటికైనా  అంతిమ విజయం కథదే. ఇది అందరూ అంగీకరించాల్సిందే. కార్తికేయ 2 కోసం ఎదురుచూస్తున్నా అని ట్వీట్ చేశాడు. 

విష్ణు కామెంట్స్ కి నిఖిల్ రిప్లై ఇచ్చాడు. థాంక్యూ విష్ణు బాయ్.. నీ మాటలు నాకు నా టీంకి ఎంతో సపోర్ట్ ని ఇస్తాయి అని పేర్కొన్నాడు. కార్తికేయ 2లో నిఖిల్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. 

 

My brother I am always there. Stay strong. As everyone agrees, Content always wins. Looking forward for ✊🏽

— Vishnu Manchu (@iVishnuManchu)
click me!