పుష్ప2 లో ప్రియమణి, ఎవరికి జోడీగా నటించబోతోందో తెలుసా...?

By Mahesh JujjuriFirst Published Aug 2, 2022, 3:08 PM IST
Highlights

పుష్ప2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో కాని.. సినిమా మీద పుకార్లు మాత్రం గట్టిగానే షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాలో ఫలానా  స్టార్స్ నటిస్తున్నారు.. అంటూ చాలా మంది పేర్లు వినిపిస్తున్న తరుణంలో మరో సీనియ్ హీరోయిన్ ప్రియమణి పేరు కూడా తెరపైకి వచ్చింది. 
 

టాలీవుడ్ లో  ఒకప్పుడు యంగ్ హీరోస్ తో పాటు సీనియర్ హీరోలతో కూడా ఆడిపాడిన భామ ప్రియమణి. హీరోయిన్ గా గా తెలుగు , తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న ప్రియమణి.. కొంత కాలం సినిమాలకు దూరం అయ్యింది. ఇక టీవీ షోల ద్వారా మళ్లీ తెరపైకి వచ్చిన సీనియర్ బ్యూటీ..  రీ ఎంట్రీలోను మంచి అవకాశాలనే అందుకుంటోంది. ఈ మధ్య వచ్చిన వరుస సినిమాలతో సందడి చేస్తోంది ప్రియమణి.   ఇక రీసెంట్ గా మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట చిన్నది. 

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరువాత నారప్ప సినిమాలో ఆమెకి మంచి పాత్రపడింది. ఆ తరువాత రీసెంట్ గా  వచ్చిన విరాటపర్వం సినిమాలోను ప్రియమణికి కీలకమైన పాత్రనే దక్కింది. ఇక ఇప్పుడు దేశమంతా ఎంతో ఉత్కంటతో ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కీలకపాత్రలో ప్రియమణి నటించబోతున్నట్టు తెలుస్తోంది. 

తాజాగా  అందుతున్న సమాచారం ప్రకారం ప్రియమణిని  పుష్ప 2  సినిమా కోసం తీసుకున్నట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూస్ షికారు చేస్తోంది.  వచ్చేనెల నుంచి పుష్ప 2 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను ను సెట్స్  పైకి తీసుకుని వెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం  కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. 

అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి జోడీగా ప్రియమణి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు పాత్రకి కూడా ఈ సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నారు. అందుకే అంత ఇంపార్టెంట్ పాత్ర కాబట్టే ప్రియమణి అయితే బాగుంటుంది అని మేకర్స్ భావిస్తున్నారట.  ఇక పుష్పను మించిన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేయాలని.. ఇప్పటికే  దేవిశ్రీ ప్రస్తాద్ పుష్ప2కి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడట.  ఈసినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

click me!