సినిమా రివ్యూలపై నిషేధం? హైకోర్టు ఏం చెప్పింది?

By Surya Prakash  |  First Published Dec 4, 2024, 10:09 AM IST

సినిమా రిలీజైన మొదటి మూడు రోజులు ఆన్‌లైన్ రివ్యూలపై నిషేధం విధించాలని కోరుతూ తమిళనాడు ఫిల్మ్ నిర్మాతల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.



సినిమా రిలీజైన తేదీ నుంచి మూడ్రోజుల వరకు ఆన్ లైన్ రివ్యూలపై నిషేధం విధించాలంటూ తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్  (TFAPA) ) మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రివ్యూలపై మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని టీఎఫ్ఏపీఏ  (TFAPA) న్యాయస్థానాన్ని కోరింది. సామాజిక మాధ్యమాల్లో సమీక్షలు ప్రసారం చేసే వ్యవహారమై నిబంధనలు తీసుకురావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ నిర్ణయం కంగువా వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ సమీక్షల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న నేపథ్యంలో తీసుకున్నారు.

అయితే  సినిమా రివ్యూలపై నిషేధం విధించడానికి మద్రాసు హైకోర్టు నిరాకరించింది.  పిటిషన్‌ను మంగళవారం విచారించిన న్యాయమూర్తి ఎస్‌.సౌందర్‌.. విమర్శ అనేది భావప్రకటనా స్వేచ్ఛ అని ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడం కుదరదని తెలిపారు. పిటిషన్‌పై నాలుగు వారాల్లో జవాబివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, యూట్యూబ్‌కుఉత్తర్వులు ఇచ్చి విచారణ వాయిదా వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎస్.సౌందర్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ, నోటి మాటగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రివ్యూలు, సినిమాలపై విమర్శలు వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందకు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఆ హక్కులను ఎలా కాదనగలమని పేర్కొన్నారు.
 
కోర్టులో వేసిన పిటీషన్ లో వారు ప్రస్తావించిన అంశాలు ఏమిటంటే...

నెగటివ్ రివ్యూల ప్రభావం సినిమాల కలెక్షన్స్ పై విపరీతంగా ఉంటోంది. నిర్మాతల ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై వచ్చే ప్రాథమిక రివ్యూలు వ్యక్తిగత దూషణలకు దారితీయడం లేదా సినిమాపై ద్వేషం ప్రదర్శించడం వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయి. అలాగే యూట్యూబ్ ఇంటర్వ్యూలపై ఆంక్షలు విషయానికి వస్తే...థియేటర్ యజమానులను అభిమానుల యూట్యూబ్ ఇంటర్వ్యూలను ఆపేందుకు కోరారు, ఇది సినిమాపై ప్రతికూల ప్రచారాన్ని పెంచుతుందని TFAPA భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్లు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి, ఆన్‌లైన్ రివ్యూలపై నిబంధనలు రూపొందించాలని కోరటం జరిగింది.

click me!