చివరికోరిక తీరనే లేదు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన శరత్ బాబు, ఇంతకీ ఆయన కోరికేంటంటే..?

Published : May 23, 2023, 09:20 AM ISTUpdated : May 23, 2023, 09:42 AM IST
చివరికోరిక తీరనే లేదు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన శరత్ బాబు, ఇంతకీ ఆయన కోరికేంటంటే..?

సారాంశం

71 ఏళ్ళ వయస్సులో.. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు సీనియర్ నటులు శరత్ బాబు. చాలా కాలం ప్రాణాలకోంసం పోరాటం చేసిన ఆయన.. చివరకు తుదిశ్వాస విడిచారు. అయితే శరత్ బాబు తన చివరి కోరిక తీరకుండానే మరణించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన చివరికోరిక ఏంటంటే..?   

71 ఏళ్ళ వయస్సులో.. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు సీనియర్ నటులు శరత్ బాబు. చాలా కాలం ప్రాణాలకోంసం పోరాటం చేసిన ఆయన.. చివరకు తుదిశ్వాస విడిచారు. అయితే శరత్ బాబు తన చివరి కోరిక తీరకుండానే మరణించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన చివరికోరిక ఏంటంటే..? 

సౌత్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన ఆయన పరిస్థితి విషమించింది. వెంటనే బెంగళూరుకు తరలించగా.. అక్కడ కూడా పరిస్తితిలో మార్పు రాకపోవడంతో.. వెంటనే హైదరాబాద్ కు శరత్ బాబును తరలించారు.  ఇక్కడే గత నెల రోజులుగా చికిత్స తీసుకుంటున్న శరత్ బాబుకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగింది. కిడ్నీ,లివర్, లంగ్స్ అన్నింటిలో ఇన్ ఫెక్షన్ వ్యాపించి.. పనిచేయడం మానేశాయి. దాంతో వెంటిలేటర్ పై ఆయనకు ట్రీట్మెంట్ చేశారు వైద్యులు. అయినా లాభం లేకుండా పోయింది. 

ఇక నిన్న (మే 22) మధ్యాహ్నం 1.30 నిమిషాలకు శరత్ బాబు కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. ఈక్రమంలో దాదాపు 250కి పైగా సినిమాలు చేసిన శరత్ బాబు.. కోట్లలో ఆస్తులు కూడబెట్టారు. కాని పర్సనల్ లైఫ్ లో మాత్రం సంతోషంగా లేదు. తెలుగులో మళ్ళీ పెళ్లి.. తమిళంలో వసంత ముళ్లై సినిమాలు ఈ ఏడాదిలోనే నటించిన శరత్ బాబు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ నటుడిగా వెలుగొందారు. ఇంత చేసినా.. ఆయన తన చివరికోరిక తీరకుండానే మరణించారు. 

సినిమాలు ఆపేసి ఇక వ్యాక్తిగతంగా హార్సిలీ హిల్స్ లో సెటిల్ అవ్వాలి అన్నది ఆయన కోరికట. అందుకే అక్కడ ఇల్లు కూడా కట్టిస్తున్నాడట శరత్ బాబు. కాని ఇంకా ఇల్లు నిర్మాణం పూర్తి కాకుండానే శరత్ బాబు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యక స్థానం సంపాదించుకోవడంతో పాటు.. 8 నంది అవార్డ్ లను కూడా ఆయన సాధించారు. ఆముదాల వలస అందగాడిగా ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌