ఆ న్యూస్ చూసి బన్నీకి మంచు విష్ణు మెసేజ్.. అసూయగా ఉంది అంటూ కామెంట్స్

pratap reddy   | Asianet News
Published : Oct 20, 2021, 04:03 PM IST
ఆ న్యూస్ చూసి బన్నీకి మంచు విష్ణు మెసేజ్.. అసూయగా ఉంది అంటూ కామెంట్స్

సారాంశం

మంచు విష్ణు 'మా' అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ పై విజయం సాధించడంతో విష్ణు 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

మంచు విష్ణు 'మా' అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ పై విజయం సాధించడంతో Manchu Vishnu 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  యువకుడైన విష్ణు.. 'మా'ని ఎలా ముందుకు నడిపిస్తాడనే ఆసక్తి టాలీవుడ్ లో నెలకొంది. 

ఎన్నో వివాదాలు నడుమ మా ఎన్నికలు ముగిశాయి.Prakash Raj, విష్ణు ఇద్దరూ పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. మా ఎన్నికల హడావిడి మీడియాలో మోతెక్కింది. చివరకు విష్ణునే విజయం వరించింది. ఎన్నికల సందర్భంగా విష్ణు టీవీ ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

Allu Arjun నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం తరచుగా కలుసుకోము. కానీ ఎస్ ఎం ఎస్ లో చాలా చేసుకుంటాం అంటూ విష్ణు సరదాగా కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది. అదే సమయంలో అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' చిత్రం కూడా రిలీజ్ అవుతోందని విన్నా. ఆ టైంలో అమీర్ ఖాన్ తో పోటీ పడబోతున్న అల్లు అర్జున్ అంటూ బాలీవుడ్ లోనే పలు పత్రికలు, మీడియా సంస్థలు వార్తలు వేశాయి. 

అది చూసి అల్లు అర్జున్ అంటే నాకు అసూయ కలిగింది. అలాగే ఓ తెలుగు హీరోగా బన్నీని చూసి గర్వంగా అనిపించినట్లు విష్ణు పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని బన్నీకి మెసేజ్ చేసినట్లు విష్ణు తెలిపాడు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న Pushpa మంచి విజయం సాధించాలని.. బన్నీ అండ్ టీంకి ఆల్ ది బెస్ట్ అని విష్ణు పేర్కొన్నాడు. 

Also Read: https://telugu.asianetnews.com/entertainment/aryan-khan-bail-once-again-rejected-r19sfz

క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో పుష్ప తెరకెక్కుతోంది. డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మొదట ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా, లాల్ సింగ్ చద్దాకి పోటీగా డిసెంబర్ 25న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇటీవల ఈ చిత్రం రిలీజ్ డేట్ మార్చుతూ ప్రీపోన్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే
Anticipated Films 2026: మిర్జాపూర్ నుంచి కింగ్ వరకు.. 2026లో రాబోతున్న 5 క్రేజీ సినిమాలు ఇవే!