మంచు విష్ణు కలల ప్రాజెక్టు, శ్రీకాళహస్తిలో పాన్ ఇండియా మూవీ ప్రారంభం.. హాజరైన మోహన్ బాబు, డైరెక్టర్ ఎవరంటే

Published : Aug 18, 2023, 05:03 PM IST
మంచు విష్ణు కలల ప్రాజెక్టు, శ్రీకాళహస్తిలో పాన్ ఇండియా మూవీ ప్రారంభం.. హాజరైన మోహన్ బాబు, డైరెక్టర్ ఎవరంటే

సారాంశం

ఎట్టకేలకు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుని షురూ చేశాడు. నేడు శ్రీకాళహస్తి పుణ్యకేత్రంలో పూజా కార్యక్రమాలతో కన్నప్ప చిత్రం ప్రారంభం అయింది.

మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. మంచు విష్ణు కి చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు. విష్ణు చివరగా నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ కోసం తెరవెనుక చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి పరమ భక్తుడు అయిన కన్నప్ప పాత్రలో నటించాలనేది మంచు విష్ణు కోరిక. 

ఎట్టకేలకు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుని షురూ చేశాడు. నేడు శ్రీకాళహస్తి పుణ్యకేత్రంలో పూజా కార్యక్రమాలతో కన్నప్ప చిత్రం ప్రారంభం అయింది. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. దర్శకులు ఇతర వివరాలని కూడా చిత్ర యూనిట్ మూవీ లాంచ్ సందర్భంగా ప్రకటించారు. 

మహాభారతం టెలివిజన్ సిరీస్ దర్శకులలో ఒకరైన ముకేశ్ కుమార్ సింగ్.. మంచు విష్ణు 'కన్నప్ప' చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విష్ణు సరసన కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్ గా ఎంపికైంది. వీరిద్దరూ కన్నప్ప చిత్ర పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై విష్ణు తండ్రి మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ లాంటి రచయితలు రెండేళ్ల పాటు స్క్రిప్ట్ పై వర్క్ చేసి కథని పూర్తి చేశారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మంచు విష్ణు ఈ చిత్రం సినిమాటిక్ గా అద్భుతంగా మాత్రమే కాదు.. భక్తిపారవస్యం నింపే విధంగా రావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం ప్రాణం పెట్టి నటించేందుకు విష్ణు సిద్ధం అయ్యారు. 

శివ భక్తుడైన కన్నప్ప గురించి తెరకెక్కిస్తున్న చిత్రం కాబట్టి కాళహస్తిలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. మోహన్ బాబు మంచు విష్ణు, నుపుర్ సనన్ పై తొలి క్లాప్ ఇచ్చారు. త్వరలో ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే