చిరంజీవి గురించి ట్వీట్ చేసిన మంచు మోహన్ బాబు, మరి మెగాస్టార్ సమాధానమేంటి..?

By Mahesh JujjuriFirst Published Nov 23, 2022, 7:55 AM IST
Highlights

మంచు  మోహన్ బాబు,  మెగాస్టార్ చిరంజీవి. .. టాలీవుడ్ లో ఈ రెండు బ్రాండ్స్ పైకి ఫ్రెండ్స్ లా ఉంటూ.. లోపల ప్రపంచ యుద్దాలు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో మెహన్ బాబు చిరంజీవిని ఉద్ద్యేశిస్తూ.. ఓట్వీట్ చేశారు. మరి ఆయన ఏమన్నారు.. దానికి మెగా రిప్లై ఏంటీ..? 
 

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ.. మంచు ఫ్యామిల మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి తెలిసిందే. బయట కలిసినప్పుడు హగ్గులు...ముద్దులతో మేం భరించలేనిస్నేహితులం అంటూ చెప్పుకున్నా..ఒకరిపై మరొకరు వ్యంగ్యాస్థ్రాలు.. మా ఎన్నికల్ల జరిగిన పరిణామాలు తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే  గత కొంత కాలంగా ఎవరిపని వారు చేసుకుంటూ.. కామ్ గా ఉన్న క్రమంలో.. మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ట్వీట్ పెట్టారు మంచు మోహాన్ బాబు. 

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ ఓస్పెషల్ పేజ్ ను క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. 80, 90వ దశకంలో తన నటన, డాన్స్ తో ఒక ఊపు ఊపి వదిలిపెట్టారు. తన గ్రేస్ తో ఇండస్ట్రీల జనాలను ఉర్రూతలూగించేశాడు. మైఖేల్ జాక్సన్ ను మరిపించారు. దాదాపు నాలుగు పదుల ఏళ్లకు పైగా ఆడియన్స్ ను అలరించిన చిరూ.. ఇప్పటికీ తన విజయ యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈక్రమంలోనే ఆయనను గౌరవిస్తూ.. ఎన్నో అవార్డ్స్ చేరగా.. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మెగాస్టార్ కు మర అరుదైన గౌరవం ప్రకటించింది. 

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమంలో చిరంజీవికి ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా అనే అవార్డును ప్రకటించారు. ఇది వరకు ఈ అవార్డును రజినీ, అమితాబ్, ఇళయరాజా, ఎస్పీబీ వంటి వారుఅందుకోగా.. ఈ ఏడాది అది మెగాస్టార్ చిరంజీవిని వరించింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చిరును  సత్కరించనుంది. ఇక దేశ వ్యాప్తంగాస్లార్ సెలబ్రిటీల నుంచి చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువగా వచ్చాయి. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు... పండగ చేసుకుంటున్నారు. 

ఈ క్రమంలోనే తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ గురించి ట్వి్టర్ వేదికగా స్పందించారు. ముందుగా మోహన్ బాబు ట్వీట్ చేస్తూ.. చిరంజీవిని ప్రశంసించారు. మోహన్ బాబు ఈ మేరకు ట్వీట్ వేస్తూ.. నా ప్రియమైన చిరంజీవిని గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో ఇలాంటి సత్కారం లభించబోతోన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.. కంగ్రాట్స్.. ఆ షిర్డీ సాయి బాబా ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలి అనికోరకుంటున్నాను అని ట్వీట్ చేశారు మోహాన్ బాబు. 

 

Congratulations to my dear on being honored at . Wishing you many more laurels with the blessings of Sri Shirdi Sai Baba

— Mohan Babu M (@themohanbabu)

అటు మంచు విష్ణు కూడా స్పందించారు. చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కడ సంతోషం. ఇది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఎలాస్పందిస్తారు అని అంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మంచువారి ట్వీట్లకు మెగా రిప్లై ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. 


 

Congratulations to Sri. garu on being bestowed sure a honor. Proud Moment for the Telugu film fraternity.

— Vishnu Manchu (@iVishnuManchu)
click me!