
బిగ్ బాస్ 6 తెలుగు షో పన్నెండో వారంలో ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. సోమవారం నామినేషన్ల ప్రక్రియ, మంగళవారం తమ ఫ్యామిలీ మెంబర్స్ తో సర్‌ప్రైజ్ చేయడం, హౌజ్‌లో కోచింగ్ సెంటర్‌ని ఏర్పాటు చేయడం రెండు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. నవ్వులు పూయించాయి. భావోద్వేగానికి గురి చేశాయి. మంగళవారం ఎపిసోడ్ అన్ని ఎమోషన్స్ తో సాగడం విశేషం.
మంగళవారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కి `బిగ్ బాస్ కోచింగ్ సెంటర్` అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో నలుగురిని టీచర్లని చేయగా, మిగిలిన వాళ్లు స్టూడెంట్స్. వారిలో ఫైమా ఇంగ్లీష్ టీచర్, ఆదిరెడ్డి డాన్సింగ్ టీచర్, శ్రీ సత్య మేకప్ టీచర్, రాజ్ సింగింగ్ టీచర్. మొదట ఫైమా ఇంగ్లీష్ క్లాస్ ని నిర్వహించారు. ఇందులో ఆమె తనకు వచ్చిరాని ఇంగ్లీష్‌తో ఇరగదీసింది. నవ్వులు పూయించింది.
ఫైమా `ఈ` ఎలిఫెంట్ స్పెల్లింగ్ తప్పు రాయడంతో కామెంట్లు చేశారు ఇతరసభ్యులు. అలాగే అప్రిషియేట్‌ని సైతం రాంగ్ రాసి నవ్వులు పూయించింది. ఆమె బట్టర్ ఇంగ్లీష్‌ని ఒక రేంజ్‌లో ఆడుకున్నారు సభ్యులు. చిన్న పిల్లలుగా మారి, టీచర్ చెప్పింది వినకుండా, ఆమెని విసిగిస్తూ కామెడీ పండించారు. షోని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఇందులో శ్రీహాన్ తన పిర్ర గిచ్చుతుందని అని శ్రీసత్యపై ఫైమాకి కంప్లెయింట్ చేయడం మరింతగా ఆకట్టుకుంది.
అనంతరం మేకప్ క్లాస్ నిర్వహించగా, మేకప్స్ ఐటెమ్స్ తో శ్రీ సత్య కాసేపు ఎంటర్‌టైన్ చేసింది. శ్రీహాన్‌పై మేకప్ ప్రయోగాలు చేసింది. ఆయన్ని అమ్మాయిలా మార్చే ప్రయత్నం చేసింది. అయితే మేకప్ అంటే ఏంటి? అని అడిగినప్పుడు ఇతరసభ్యులు చెప్పే ఆన్సర్లు నవ్వులు పూయించాయి. చివరగా ఆదిరెడ్డి డాన్సింగ్ క్లాస్ నిర్వహించారు. ఇందులో ఆదిరెడ్డి తన దారుణమైన డాన్సుతో రఫ్ఫాడించారు. అటూ ఇటు తిప్పుతూ కామెడీ డాన్సింగ్ తో హౌజ్ మొత్తాన్ని ఎంటర్‌టైన్ చేశారు. కామెడీని పండించారు. తను చేసే డాన్సులు మరింత నవ్వులు తెప్పించేలా ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే ఫైమా టీచర్‌గా చేసిన అనంతరం ఆదిరెడ్డిని సర్ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. ఆయన భార్య కవిత, కూతురుని ఇంట్లోకి పంపించి సర్‌ప్రైజ్ చేశారు. దీంతో భార్యని, కూతురుని చూసి ఉప్పొంగిపోయాడు ఆదిరెడ్డి. ఈ సందర్బంగా ఆదిరెడ్డి ఆటతీరుపై ఆమె ప్రశంసలు కురిపించింది. అంతా బాగా ఆడుతున్నారని తెలిపింది. నా డాన్స్ వరస్ట్ గా ఉంది కదా? అని ఆదిరెడ్డి కవితను అడిగాడు. లేదు నవ్వుకోవచ్చని ఆమె చెప్పారు. నువ్వు కూడా నవ్వుకుంటున్నావా నా డాన్స్ చూసి, అని ఆదిరెడ్డి ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
గేమ్ లో కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి మెలిసి ఉండండని కవిత అన్నారు. నన్ను కూడా కొట్టమంటావా? అని ఆదిరెడ్డి అడిగాడు. నిన్ను కూడా నువ్వేమన్నా తోపా అని కవిత పంచ్ వేసింది. ఆమె కామెంట్ కి ఇంటి సభ్యులు పెద్దగా నవ్వేశారు. రోహిత్, మెరీనాల ప్రస్తావన వచ్చినప్పుడు మీరు చాలా క్యూట్‌గా ఉంటారని తెలపగా, అవును కవిత నాకు ఎంతో నచ్చారు. వీరినిచూశాక నాకు రెండో పెళ్లి చేసుకోవాలనిపించింది అని ఆదిరెడ్డి చెప్పగా, ఫస్ట్ ఉన్న దాన్ని బాగా చూసుకో అంటూ కౌంటరిచ్చింది కవిత. హౌస్లో ఉన్న కారణంగా ఆదిరెడ్డి కూతురు ఫస్ట్ బర్త్ డే మిస్ అయ్యాడు.
దీంతో బిగ్ బాస్ హౌస్లో కేక్ అరేంజ్ చేశాడు. ఇంటి సభ్యుల మధ్య ఆదిరెడ్డి తన కూతురు బర్త్ డే వేడుకలు చేశాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్‌కి ఆదిరెడ్డి థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు తనకు ఇంతకంటే సక్సెస్ ఏం కావాలి బిగ్ బాస్ అని ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఆదిరెడ్డి. ఓ కామన్ మ్యాన్ హౌజ్‌కి వచ్చి 12 వారాలుఉండటం గొప్ప విషయమని, తన ఫ్యామిలీని బిగ్ బాస్‌లో చూసుకున్నానని, ఇంతకంటేఏం కావాలి బిగ్ బాస్ ఆంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఆదిరెడ్డి.
రెండో టాస్క్ అనంతరం తన తల్లిని ఇంట్లోకి పంపించి రాజ్‌ని సర్‌ప్రైజ్ చేశారు బిగ్ బాస్. వాళ్లమ్మ అందరి ఆటతీరుపై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో ఫస్ట్ టైమ్‌లో తనని బయటి ప్రపంచానికి తన ఫ్యామిలీని చూపించానని, చాలా ఆనందంగా ఉందని రాజ్, వాళ్లమ్మ గర్వపడ్డారు. ఇప్పుడుతనకు క్రేజ్ పెరిగిందని, సెల్ఫీలు అడుగుతున్నారని తెలిపారు. అయితే ఈ క్రమంలో రోహిత్, రేవంత్, కీర్తిలు కన్నీళ్లు పెట్టుకోవడం బాధగా అనిపించింది. ఫ్యామిలీ, పిల్లలను గుర్తు చేసుకుని వాళ్లు ఎమోషనల్ అయ్యారు.