`యశోద` ఓటీటీ రిలీజ్‌ డేట్‌.. వచ్చేది అప్పుడే?

Published : Nov 22, 2022, 08:46 PM IST
`యశోద` ఓటీటీ రిలీజ్‌ డేట్‌.. వచ్చేది అప్పుడే?

సారాంశం

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `యశోద` మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇది ఓటీటీలో వచ్చే డేట్‌ కూడా ఫిక్స్ అయ్యింది.

సమంత ఇటీవల `యశోద` చిత్రంతో అలరించింది. తనదైన స్టయిల్‌లో వెండితెరపై విశ్వరూపం చూపించింది. అద్భుతమైన నటనతోపాటు యాక్షన్‌తోనూ అదరగొట్టింది. ఈ చిత్రం థియేటర్లలో రచ్చ చేసింది. మంచి కలెక్షన్లని సాధించింది. సుమారు నాలభై కోట్ల బిజినెస్‌తో థియేటర్‌లోకి వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్‌ అయ్యిందని సమాచారం. 

ఇక రిలీజ్‌కి ముందే సేఫ్‌లోకి వెళ్లిన ఈ చిత్రం నవంబర్‌  11న విడుదలైన విషయం తెలిసిందే. వీకెండ్‌ మూడు రోజులు మంచి కలెక్షన్లని సాధించింది. కానీ కృష్ణ హఠాన్మరణం ఈ చిత్రం కలెక్షన్లపై ప్రభావం పడింది. మూడు రోజులు గట్టిగా దెబ్బ పడింది. ఇక కోలుకునే లోపు కొత్త సినిమాలు వచ్చాయి. దీంతో డల్‌ అయిపోయింది. సెటిల్డ్ గా రన్‌ అవుతుందీ చిత్రం. 

సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం రిలీజ్‌ అయిన సినిమా కావడం, అనారోగ్యానికి గురి కావడం, ఆసుపత్రిలో సెలైన్‌ తీసుకుంటూ డబ్బింగ్‌ చెప్పిందనే సెంటిమెంట్‌ ఈ సినిమాకి కలిసొచ్చాయి. దీనికితోడు సినిమాలో ట్విస్ట్ లు అదిరిపోయాయి. సమంత పాత్రలోని ట్విస్ట్ మరింతగా హైలైట్‌గా నిలిచింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదల కావడంతో ఇతర రాష్ట్రాల కలెక్షన్లు దీనికి కలిసొచ్చాయి. కానీ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో కలెక్షన్లు లేకపోవడం గమనార్హం. 

ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓటీటీ డేట్‌ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఈ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలో రాబోతుందని తెలుస్తుంది. డిసెంబర్‌ రెండో వారంలో 9వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుంది. ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా నాలుగు వారాల్లోనే ఓటీటీలో రాబోతుందని తెలుస్తుంది. ఓ మోస్తారు నుంచి, పెద్ద సినిమాలు థియేటర్లో విడుదలైన పది వారాల తర్వాతనే ఓటీటీలో రిలీజ్‌ చేయాలనే నిబంధన ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ ముందే రిలీజ్‌ కాబోతుండటం గమనార్హం.  మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓటీటీ రైట్స్ రూ. 25కోట్లు అన్ని భాషల్లో అమ్ముడుపోయినట్టు సమాచారం. 

సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రావు రమేష్‌, సంపత్‌ రాజ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ఉన్నిముకుందన్‌తోపాటు కల్పిక ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హరి, హరీష్‌ దర్శకత్వం వహించింది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్