మంచు విష్ణు - మనోజ్ వివాదంపై తండ్రి మోహన్ బాబు సీరియస్.. ఉదయమే మనోజ్ కు ఫోన్ చేసి..

By Asianet News  |  First Published Mar 24, 2023, 12:30 PM IST

మంచు ఫ్యామిలీలోని విబేధాలు తాజాగా రోడ్డున పడ్డాయి. విష్ణు - మనోజ్ మధ్య మనస్ఫార్థాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీనిపై ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుండగా.. తండ్రి మోహన్ బాబు సీరియస్ అయ్యారు. తాజాగా వివాదంపై స్పందించారు. 
 


ఎప్పటి నుంచో మంచు ఫ్యామిలీ ఇంట్లో విబేధాలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.  ముఖ్యంగా మంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య ఏర్పడ్డ మనస్పార్థాలు ప్రస్తుతం తారా స్థాయికి చేరుకుంది. తాజాగా వారి వివాదం రోడ్డున కూడా పడింది. నిన్న రాత్రి నుంచే అన్నదమ్ములిద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. తన ఇంట్లోనే పనిచేసిన సారథి అనే ఇంట్లో మనోజ్ ఉండటంతో అక్కడికీ వెళ్లి మరీ విష్ణు దాడి చేసినట్టుగా తాజాగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మంచు మనోజ్ నే పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండటం, అన్నదమ్ముల వివాదంపై తండ్రి Mohan Babu సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి గొడవ జరగడంతో ఇవాళ ఉదయం మంచు మనోజ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మోహన్ బాబు మనోజ్ కు ఫోన్ ద్వారా ఉదయమే వీడియోను డిలీట్ చేయమని చెప్పారంట. ఇంటి వివాదాన్ని సోషల్ మీడియా దాకా ఎందుకు తీసుకెళ్లారని మందలించినట్టుగా తెలుస్తోంది. దాంతో పదిగంటలకు వీడియోను పోస్ట్ చేసిన మనోజ్ వెంటనే డిలీట్ కూడా చేశారు. 

Latest Videos

ఇక అన్నదమ్ముల మధ్య అసలు గొడవకు కారణం ఏంటనేది స్పష్టత లేదు. ప్రస్తుతం మనోజ్ ఈ ఘర్షణపై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటున్నారు.  మరోవైపు మోహన్ బాబు మాత్రం ఇద్దరినీ సముజాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఓ మీడియా ఛానెల్ కు ఫోన్ చేసి మరీ వివాదంపై మాట్లాడారు. అన్న దమ్ముల గొడవలు స్వరసాధారణమని, దీన్ని ఇంటి గొడవగానే చూడాలని సూచించారంట. ఇక ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉండటంతో వీరిద్దరికి నచ్చజెప్పే బాధ్యతను కూతురు మంచులక్ష్మి (Manchu Laxmi)పై  పెట్టినట్టు తెలుస్తోంది. 

ఇప్పటివరకు మనోజ్ అక్క ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది. కొద్ది సేపటి కిందనే మంచు లక్ష్మి కారులో ఇంటి నుంచి బయల్దేరినట్టు  సమాచారం. అయితే ఆమె ఎక్కడికి వెళ్తున్నారన్నదని తెలియదు. వివాదాన్ని సద్దుమణిగించేందుకు బహుశా వారి శంషాబాద్ లోని ఇంటికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటీ, మరీ ఇంతదూరం రావాల్సిన అవసరం ఏంటనేది మంచు లక్ష్మి స్పందిస్తే గానీ తెలిసే అవకాశం లేదు. 

click me!