భూమా మౌనికతో మంచు మనోజ్ వివాహం.. డేట్ ఫిక్స్..

Published : Feb 25, 2023, 12:32 PM IST
భూమా మౌనికతో మంచు మనోజ్ వివాహం.. డేట్ ఫిక్స్..

సారాంశం

మంచు మనోజ్ టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరీర్ ఆరంభంలో యూత్ ఫుల్ చిత్రాలతో మంచు మనోజ్ అలరించాడు. ఆ తర్వాత కెరీర్ ట్రాక్ తప్పింది.

మంచు మనోజ్ టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరీర్ ఆరంభంలో యూత్ ఫుల్ చిత్రాలతో మంచు మనోజ్ అలరించాడు. ఆ తర్వాత కెరీర్ ట్రాక్ తప్పింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా మనోజ్ మంచి మనసున్న వ్యక్తి అని అభిమానులు ప్రశంసిస్తుంటారు.

ఇటీవల మంచు మనోజ్ తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ తన మొదటి భార్య నుంచి విడిపోయారు. ప్రస్తుతం మనోజ్ రెండో వివాహానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా మనోజ్ భూమా మౌనికతో రిలేషన్ లో ఉన్నాడు. గతంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా వీరిద్దరూ జంటగా కనిపించారు. అప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్ అఫీషియల్ గా వైరల్ అవుతోంది. 

అయితే త్వరలో మంచు మనోజ్, భూమా మౌనిక తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందట. మార్చి 3న భూమా మోనిక, మనోజ్ ల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ పెళ్ళికి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. 

మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి పెళ్లి ఏర్పాట్లని దగ్గరుండి చూసుకుంటున్నారట. మంచు మనోజ్ కి, భూమా మౌనికకి చాలా కాలం క్రితమే పరిచయం ఉంది. భూమా అఖిల ప్రియ, భూమా మౌనిక తమ తల్లిందండ్రుల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. భూమా మౌనిక తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరూ కొన్నేళ్ల క్రితం మరణించారు. 

మంచు మనోజ్ ఇటీవలే తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. తిరిగి నటుడిగా యాక్టివ్ అయ్యేందుకు మనోజ్ ప్రయత్నిస్తున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ