చరిత్ర సృష్టించిన రామ్ చరణ్.. అంతర్జాతీయ వేదికపై ‘అవార్డు ప్రజెంటర్’గా మెగాపవర్ స్టార్.. అరుదైన గౌరవం!

By Asianet News  |  First Published Feb 25, 2023, 11:59 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కు అరుదైన గౌరవం దక్కింది.  అంతర్జాతీయ వేదికపై తొలి భారతీయ నటుడిగా ఆ ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. 
 


‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఏకంగా హాలీవుడ్ గడ్డపైనా తెలుగోడి పేరు చెబితేనే వచ్చే అరుపులు కేకలు మాములుగా లేవు. RRRకు వస్తున్న రెస్పాన్స్ , రీసౌండ్ అదిరిపోతోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా Ram Charan క్రేజ్ కూడా అంతకంతకూ  పెరిగిపోతోంది. ఇప్పటికే హాలీవుడ్ దిగ్గజ్జ నటుడు జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ లోని చరణ్ పాత్రపై  ప్రత్యేకంగా ప్రశంసించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్స్ ప్రమోషన్స్ కోసం  అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొని అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో అవార్డు ప్రజెంటర్ గా గౌరవం దక్కించుకున్నారు. బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును అందజేశారు. దీంతో అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. 

Latest Videos

undefined

హాలీవుడ్ గడ్డపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో ఎదుగుదలను సోషల్ మీడియా ద్వారా చాటిచెబుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆస్కార్స్2023’ ప్రమోషన్స్ లో అమెరికాలోని ఆయా మీడియా సంస్థలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం HCA అవార్స్ వేదికకు హాజరై ఆకట్టుకున్నారు.  

ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఆస్కార్స్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. చివరిగా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ ను అందుకోగా.. ప్రస్తుతం HCA అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ప్రపంచం మొత్తం ఎదురుచూసే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆర్ఆర్ఆర్ నుంచి సెన్సేషనల్ హిట్ సాంగ్ ‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్స్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మార్చి12న ఆస్కార్స్ అవార్డ్స్ ఫంక్షన్ అమెరికాలో గ్రాండ్ గా జరగబోతోంది. 

The Mr cool presents the award at HCA for best voice-over 👌🏼 pic.twitter.com/JQBpQsfpWc

— Beyond Media (@beyondmediapres)
click me!