మంచు మనోజ్ 'లేఖ' వెనక అసలు స్కెచ్ ఇదా?

Published : Oct 22, 2018, 09:32 AM ISTUpdated : Oct 22, 2018, 10:09 AM IST
మంచు మనోజ్ 'లేఖ' వెనక అసలు స్కెచ్ ఇదా?

సారాంశం

మంచు మనోజ్ ...గతంలో ఒకసారి తాను ఇక సినిమాలు చేయనని ప్రకటించి, అభిమానుల కోరిక మేరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మరోసారి దాదాపు అలాంటి ప్రకటనే చేసి షాకిచ్చారు. ఆయన తన అభిమానులను ఉద్దేశించి రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ లేఖ ఇప్పుడు సినీ,మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

మంచు మనోజ్ ...గతంలో ఒకసారి తాను ఇక సినిమాలు చేయనని ప్రకటించి, అభిమానుల కోరిక మేరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మరోసారి దాదాపు అలాంటి ప్రకటనే చేసి షాకిచ్చారు. ఆయన తన అభిమానులను ఉద్దేశించి రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ లేఖ ఇప్పుడు సినీ,మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

మంచు మనోజ్ కేవలం హీరోగానే కాకుండా వేరే వారి సినిమాల్లో కీలకమైన లేదా గెస్ట్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన్ని విజయం పలకరించటం ఈ మధ్యన తగ్గిపోయింది. భాక్సాఫీస్ దగ్గర మనోజ్ సినిమాలు పల్టీకొట్టేసాయి. ఈ నేఫద్యంలో మనోజ్ మళ్లీ తనన తాను ప్రూవ్ చేసుకునే ఓ డిఫరెంట్ పాత్రతో వస్తాడని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో చేసిన ప్రకటన ఆశ్చర్యపరిచేదే.

సినిమాలే తనకు ప్రపంచం కాదంటూ...యువతకు చేతనైన సహాయం చేయడానికి తిరుపతి బయలు దేరినట్టు  మనోజ్ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. అయితే ఈ లేఖ చదివిన వాళ్లు ...మనోజ్ సినిమాలు పూర్తిగా మానేయటం లేదు కానీ కొంతకాలం గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాడని, రాజకీయాల్లోకి రాబోతున్నాడని అంటున్నారు. 

మరి ఏ పార్టీ తరుపున మనోజ్ ప్రచారం చేయబోతున్నాడనేది తెలియటం లేదని చెప్తున్నారు. ఎలక్షన్స్ లో నిలబడే ఆలోచన కూడా ఉందనితిరుపతి నుంచి ఓ పార్టి తరుపున సీట్ ట్రై చేస్తున్నాడని ... ప్రచారం జరుగుతోంది. అందుకే ఇలా తను ఇక నుంచి డైరక్ట్ గా ప్రజాసేవలోకి వస్తున్నట్లు ప్రకటన ఇచ్చాడంటున్నారు. యూత్ రాజకీయాల్లోకి రావాలి అనేది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండే కాబట్టి ఈ విషయం నిజమే అయితే మనోజ్ ని అభినందించాల్సింది. అయితే సీట్ ట్రై చేయటం అనే విషయంలో  ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్త.. 

మనోజ్ కొత్త జర్నీ.. ప్రపంచమంతా విస్తరింపజేస్తాడట! 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?