త్రివిక్రమ్ కొత్త చిత్రంలో బన్ని క్యారెక్టర్.. షాకింగ్

Published : Oct 22, 2018, 07:51 AM IST
త్రివిక్రమ్ కొత్త చిత్రంలో బన్ని  క్యారెక్టర్.. షాకింగ్

సారాంశం

అల్లు అర్జున్ గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసారు. ఆ రెండింటికి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది.

సినీ మీడియాలో ఓ చిత్రమైన లక్షణం ఉంది...సినిమా వాళ్లకైనా అన్ని ఊహలు ఉంటాయో ఉండవో కానీ ... మీడియావాళ్లకు మాత్రం కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఏదైనా కాంబో అనుకుంటున్నారంటే ఆ ప్రాజెక్టు కథేంటి.. అందులో హీరో క్యారక్టర్ ఏంటి..టైటిల్ ఏమనుకుంటున్నారు వంటి విషయాలతో రచ్చ రచ్చ చేసేస్తారు. తాజాగా త్రివిక్రమ్, బన్ని కాంబినేషన్ మరో సారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రంపై ఊహాగానాలు అప్పుడే మొదలయి పోయాయి. 

ఫిల్మ్ సర్కిల్స్ లో అనుకుంటున్నదాని ప్రకారం... త్రివిక్రమ్ కొత్త చిత్రంలో అల్లు అర్జున్ ... ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. పూర్తిస్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. నేపధ్యం నక్సలిజం ఉండబోతోంది. అప్పట్లో నక్సలైట్ల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన ఓ పోలీస్ అధికారి పాత్ర ను దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను డిజైన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 

అల్లు అర్జున్ గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసారు. ఆ రెండింటికి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది. అలాగే అల్లు అర్జున్ ఇంతకు ముందు పోలీస్ పాత్రలో రేసుగుర్రంలో కొద్ది సేపు కనిపించి అదరకొట్టారు. ఆ పాత్రకు ఎక్సటెన్షన్ మాత్రం కాదని, సీరియస్ గా సాగే కథ అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజముందనేది తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?