మంచు హీరో మంచి నీటి సాయం

Published : Jun 25, 2019, 05:00 PM IST
మంచు హీరో మంచి నీటి సాయం

సారాంశం

ఒకప్పుడు సినిమాలతో జనాల దృష్టిలో నిలిచిన మంచు మనోజ్ ఇప్పుడు మాత్రం మంచి పనులతో అందరిని ఆకర్షిస్తున్నాడు. సొంత రాష్ట్రంలోనే కాకుండా తన సహాయ సహకారాలను పక్కా రాష్ట్రాలకు కూడా అందిస్తున్నాడు. చెన్నైలో చాలా మంది పేద ప్రజలు మంచి నీటికోసం అల్లాడుతున్నారు.   

విషయం తెలుసుకున్న మనోజ్ వెంటనే తన స్నేహితులతో కలిసి తనవంతు సహాయాన్ని అందించేందుకు సిద్దమయ్యాడు. దేశంలో ఆరవ పెద్ద నగరమైన చెన్నైలో  త్రాగు నీటికోసం ఇబ్బంది పడుతున్నవారికి  మంచి నీటిని అందిస్తూ అందరూ ఈ మంచి పనిలో భాగం కావాలని మనోజ్ కోరుకున్నారు. 

గతంలో చెన్నైకి వరదలొచ్చినప్పుడు సహాయం అందించడంలో ముందడుగేసిన మనోజ్ హుధుద్ తుపాన్ బాధితులకు సహాయం చేయడంలో కూడా ఓ చేయి వేశాడు. ఎప్పటికప్పుడు సామజిక అంశాల పట్ల సోషల్ మీడియాలో స్పందిస్తున్న ఈ యంగ్ హీరో రాజకీయాలకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బార్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే