'అర్జున్ రెడ్డి' ఓ చెత్త అంటే దానికి రీమేకా..? నటి ఫైర్!

By AN TeluguFirst Published Jun 25, 2019, 4:39 PM IST
Highlights

సీబీఎఫ్‌సీ సభ్యురాలు, టీవీ నటి వాణి త్రిపాఠి 'కబీర్ సింగ్' సినిమాపై మండిపడ్డారు. 

సీబీఎఫ్‌సీ సభ్యురాలు, టీవీ నటి వాణి త్రిపాఠి 'కబీర్ సింగ్' సినిమాపై మండిపడ్డారు. ఇదొక హింసాత్మకమైన సినిమా అని.. ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 'అర్జున్ రెడ్డి' ఓ చెత్త సినిమా అనుకుంటే ఇప్పుడు దానికి తోడు ఇది వచ్చిందని 'కబీర్ సింగ్' సినిమాపై ఫైర్ అయ్యారు. 

'అర్జున్ రెడ్డి' ఓ చెత్త సినిమా అని దానికి ఇప్పుడు రీమేక్ వచ్చిందని.. ఆదర్శంగా ఉండాల్సిన పెద్ద స్టార్లు ఇలాంటి స్క్రిప్ట్ లను ఎన్నుకోవడం కరెక్ట్ కాదని.. సంప్రదాయాల్ని పక్కన పెట్టి చిత్ర పరిశ్రమ ప్రయాణం ఇలా సాగితే నటీమణుల పాత్రలు కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితమవుతాయని అన్నారు.

మహిళలపై చెడు ప్రభావం చూపే కథను రాయడం ఆపాలని అన్నారు.  ఈ ట్వీట్ చూసిన ఓ నెటిజన్.. 'ఒక నటుడు తనకు నచ్చిన పాత్రను ఎన్నుకోవడం తప్పేముందని'  ప్రశించాడు. దీనిపై స్పందించిన వాణి త్రిపాఠి.. 'ఇక్కడ తప్పు.. ఒప్పు అనేది విషయం కాదని.. ఓ నటుడు వెండితెరపై ఎలాంటి పాత్రను  ఎన్నుకుంటున్నారనేది.. అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని' అన్నారు.

అతడు నటించకపోతే ఆ పాత్ర కేవలం పేపర్ కి మాత్రమే పరిమితమవుతుందని అన్నారు. 'కబీర్ సింగ్' సినిమాను ఉద్దేశిస్తూ బాలీవుడ్ లో చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరుగులు తీస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.87 కోట్లు వసూలు చేసింది. 

 

I'm serious about this thought that Misogyny is "Infectious" have been noticing the narrative around past few days..What a terribly misogynistic and extremely violent film! Arjun Reddy was bad enough and now this remake! Am I surprised it's doing well ...Well Well!

— Vani Tripathi Tikoo (@vanityparty)

I'm serious about this thought that Misogyny is "Infectious" have been noticing the narrative around past few days..What a terribly misogynistic and extremely violent film! Arjun Reddy was bad enough and now this remake! Am I surprised it's doing well ...Well Well!

— Vani Tripathi Tikoo (@vanityparty)
click me!