యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేషు (Adivi Sesh) తాజాగా నిర్వహించిన గుడ్ స్కూల్ యాప్ లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్బంగా తన నెక్ట్స్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో మోస్ట్ టాలెంటెడ్ హీరో అడివి శేషు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. చివరిగా ‘మేజర్’, ‘హిట్ : ది సెకండ్ కేస్’ చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గూఢాచారి 2’లో నటిస్తున్నారు. సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో గుడ్ స్కూల్ (Good School) యాప్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అడివి శేషు ముఖ్య అతిథిగా హాజరై యాప్ ను ప్రారంభించారు. అనంతరం అడివి శేషు మాట్లాడుతూ.. చదవడం ఎంత ముఖ్యమో... చదవి అంశాన్ని గుర్తు పెట్టుకోవడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. పరీక్షల సయమంలో తీవ్ర ఒత్తిడికి గురి కాకుండా సులభమైన పద్ధతితో నేర్చుకోని గుర్తు పెట్టుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ యాప్ ను తెలుగు, ఆంగ్లంలో అందించడం ద్వారా గ్రామీణ ప్రాంత పిల్లలకు సైతం ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆడవి శేషు అన్నారు. తెలుగ పిల్లలకు కావాల్సిన రితీలో విద్య అందించేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకరావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
అలాగే తనకు సైన్స్ అంటే ఎంత ఇష్టమో గణితం అంటే అంతా భయమని పేర్కొన్నారు. తనలాంటి భయాలున్న వారికి ఈ యాప్ ఉపయోగపడుతుందని భావించారు. ప్రస్తుతం ఆయన గుఢాచారి-2 (Goodachari 2) చిత్రంలో నటిస్తున్న తెలిపారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు కూడా రానుందన్నారు. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినేడి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
దీని తర్వాత నటించబోయే చిత్రం మాత్రం హాలీవుడ్ తరహా ఉంటుందని తెలిపారు. మున్ముందు మరిన్ని వివరాలు అందించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వర్క్ నడుస్తుందనట్టుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జోరు నడుస్తుండటంతో అడివి శేషు ఆ స్థాయికి మించే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ను లైనప్ లో పెడుతున్నారని అర్థం అవుతోంది. అనంతరం గుడ్ స్కూల్ యాప్ అని ఛైర్మన్ వెంకట్‌రెడ్డి యాప్ గురించి0 మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యత గల దృశ్యమాన కంటెంట్‌ను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త-ఏజ్డ్-టెక్కో సిస్టమ్ అన్నారు. శిక్షణతో పాటు, ఇది విశిష్టమైన విద్యా అనుభవాలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో సహకారం, సృజనాత్మకత, ఆట నేర్చుకునే విధంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు అడవి శేషుతోపాటు గుడ్ స్కూల్ యాప్ ఛైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎండీ శ్రీనివాసరావు, సీఈవో విజయ్ భాస్కర్, విద్యారంగానికి సంబంధించిన ప్రముఖులు పున్నమి కృష్ణ, మేములపాటి శ్రీధర్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.