ఎమోషనల్‌గా మంచు మనోజ్‌ వెడ్డింగ్‌ వీడియో.. `ఏం మనసో` అంటూ ఆకట్టుకుంటున్న సాంగ్‌..

Published : Apr 18, 2023, 10:17 AM ISTUpdated : Apr 18, 2023, 10:26 AM IST
ఎమోషనల్‌గా మంచు మనోజ్‌ వెడ్డింగ్‌ వీడియో.. `ఏం మనసో` అంటూ ఆకట్టుకుంటున్న సాంగ్‌..

సారాంశం

మంచు మనోజ్‌ తన పెళ్లి వీడియో ని పంచుకున్నారు. దాన్ని ప్రత్యేకంగా వీడియో సాంగ్‌ రూపంలో డిజైన్‌ చేసి విడుదల చేశారు. ఆద్యంతం ఎమోషనల్‌ గా సాగే ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది.

మంచు మనోజ్‌, భూమా మౌనికా రెడ్డి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమ, పెళ్లి వెనకాల నాలుగేళ్ల పోరాటం ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనోజ్‌ తెలిపారు. ఇన్నాళ్లు పరిగెత్తామని, దేశ దేశాలు తిరిగొచ్చామని తెలిపారు. పెద్దలను ఎదురించి, ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. గత నెలలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. అయితే ఆ మ్యారేజ్‌ వెనకాల చాలా భావోద్వేగభరితమైన జర్నీ ఉందనేది మనకు స్పష్టమవుతుంది. 

ఆ జర్నీని, పెళ్లిలో అద్భుతమైన మూమెంట్స్ ని పాట రూపంలో బంధించారు మంచు మనోజ్‌. వీరి పెళ్లిపై ప్రత్యేకంగా ఓ పాటని రూపొందించారు. `ఏం మనసో` అంటూ సాగే ప్రేమ గీతాన్ని తాజాగా మనోజ్‌ విడుదల చేశారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఆయన చెబుతూ, `ఈ రకమైన ప్రేమ.. జీవితంలో ఒక్కసారే ఉంటుందని చెబుతుంటారు. మీరు(మౌనికారెడ్డి) నాకోసం ఒకరని నాకు తెలుసు. నేను ఈ రోజు, ఎల్లప్పుడూ మీ అందరికి అందిస్తున్నాను. ప్రేమించబడాలని ఎలా అనిపిస్తుందో నాకు చూపించినందుకు ధన్యవాదాలు` అంటూ తన భార్య మౌనికారెడ్డికి ఈ సాంగ్‌ని అంకితం చేస్తున్నట్టుగా ఈ పాటని పోస్ట్ చేశారు మనోజ్‌. 

ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో మంచు మనోజ్‌, మౌనికా రెడ్డి పెళ్లికి ముందు విదేశాల్లో కలిసి ట్రావెల్‌ చేసిన ఫోటోలు, పెళ్లి ప్రారంభం నుంచి పెళ్లి అయిపోయేంత వరకు చోటు చేసుకున్న అత్యంత ఆనందకర, భావోద్వేగభరిత మూమెంట్లని చూపించారు. చివరికి పెళ్లిలో మనోజ్‌, మౌనికా రెడ్డి చేతులు పట్టుకుని చిన్నారి చేతులను చూపించారు. ఫైనల్‌గా శివుడి ఆజ్ఞ` అంటూ ముగించారు. ఈ పాట ఆద్యంతం ఎమోషనల్‌గా, గుండెని హత్తుకునేలా ఉంది. ఇది మంచు మనోజ్‌ ఫీలింగ్‌ని తెలియజేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఈ పాటని అనంత శ్రీరామ్‌ రాయగా, అచ్చు రాజమణి కంపోజ్‌ చేశారు. ఆయనే ఆలపించారు. దీనికి లార్డ్ శివ డైరెక్టర్‌ అంటూ వెల్లడించడం విశేషం. ప్రస్తుతం ఈ పాట వైరల్‌ అవుతుంది. మంచు మనోజ్‌.. ముందు ప్రణీతని వివాహం చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే విడిపోయారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న మనోజ్‌.. మౌనికా రెడ్డి ప్రేమలో పడ్డారు. ఆమె కూడా తన మొదటి భర్తకి విడాకులిచ్చింది. దీంతో ఈ ఇద్దరు కలిసి తిరిగారు. ఈ క్రమంలో వీరి ప్రేమకి ఇంట్లో నుంచి ఎదురైన వ్యతిరేకతపై పోరాడి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. గత నెల 3,4తేదీలో మనోజ్‌, మౌనికారెడ్డి ఒక్కటయ్యారు. మౌనికా రెడ్డి.. మాజీ మంత్రులు భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డిల రెండో కూతురు. మొదటి కూతురు అఖిల ప్రియా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న విసయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్