వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం.. మంచు మనోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

Published : Sep 18, 2018, 06:28 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం.. మంచు మనోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

సారాంశం

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యపై మంచు మనోజ్ స్పందిస్తూ ఎమోషనల్ గా ఓ లేఖని రాసిన సంగతి తెలిసిందే. ఆయన పోస్ట్ చేసిన ఆ లెటర్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యపై మంచు మనోజ్ స్పందిస్తూ ఎమోషనల్ గా ఓ లేఖని రాసిన సంగతి తెలిసిందే. ఆయన పోస్ట్ చేసిన ఆ లెటర్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మనోజ్ కి మద్దతుగా ట్వీట్లు పెడుతుండగా మరికొందరు మాత్రం మనోజ్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

దీంతో వారికి ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు మనోజ్. తనతో ఈ విషయంపై వాదించిన వ్యక్తిని ఉద్దేశిస్తూ నీ ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి నా అసలైన భాషలో మాట్లాడతాను అంటూ కామెంట్ చేశారు. మరొక నెటిజన్ ఈ కులం పిచ్చోళ్లు ఎప్పటికీ మారారన్నా.. వారిని వదిలేయ్ అంటూ ట్వీట్ చేయగా దానికి స్పందించిన మంచు మనోజ్.. 

''వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం.. తొక్క'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి ఊహించని రిప్లయ్ అంటూ అభిమానులు స్పందిస్తున్నారు. మనోజ్ ఎంతగా ఈ విషయంపై అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా.. కొందరు మాత్రం వితండవాదం చేస్తుండడంతో వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీ లాంటి వారికి ఆరోగ్య సమస్య వస్తే ఇతర కులాల డాక్టర్ల వద్దకు ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి.. 

ప్రణయ్ హత్యపై మంచు మనోజ్ లెటర్!

PREV
click me!

Recommended Stories

సీజన్ 9లో భరణి అన్ అఫీషియల్ విన్నర్, నాగబాబు రెకమండేషన్ ఇలా వర్కౌట్ అయిందా.. మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్
Karthika Deepam 2 Latest Episode: దీపను బ్రతిమాలిన శ్రీధర్- స్వప్న, కాశీలను కలిపిన కార్తీక్