మంచు విష్ణు నుంచి అది నేర్చుకోవాలి.. అన్నపై మనోజ్‌ క్రేజీ సెటైర్లు, నాన్న నుంచి నేర్చుకున్నది అదే

Published : May 19, 2025, 09:31 PM ISTUpdated : May 19, 2025, 09:38 PM IST
manchu vishnu, manchu manoj

సారాంశం

మంచు విష్ణుతో మంచు మనోజ్‌కి మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అన్నపై మనోజ్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సెటైర్లు పేల్చారు. 

మంచు ఫ్యామిలీ మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణులకు, మనోజ్‌కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

మోహన్‌ బాబు యూనివర్సిటీ, స్కూల్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని మనోజ్‌ ఆరోపిస్తున్నారు. ఆస్తుల కోసమే ఈ వివాదం చేస్తున్నాడని మంచు విష్ణు వర్గం నుంచి వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది.

`భైరవం` చిత్రంతో నటుడిగా మంచు మనోజ్‌ రీఎంట్రీ

తాజాగా మంచు మనోజ్‌ తొమ్మిదేళ్ల తర్వాత `భైరవం` చిత్రంతో నటుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో నారా రోహిత్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కూడా నటిస్తున్నారు. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించగా, కెకె రాధా మోహన్‌ నిర్మిస్తున్నారు. 

ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం జరిగింది. ఇందులో సంచలన వ్యాఖ్యలు చేశారు మనోజ్‌. కట్టుబట్టలతో రోడ్డుమీదకు పంపించారని, తనకు ఏం లేకుండా చేశారని మోహన్‌ బాబు, మంచు విష్ణులపై ఆరోపణలు చేశారు మనోజ్‌.

నమ్మిన వాళ్లని బాగా చూసుకోవాలని నాన్న నుంచి నేర్చుకున్నా

అదే సమయంలో నాన్న అంటే ఎంతో ఇష్టమని, ఆయన్నుంచి గొప్ప విషయాలను నేర్చుకున్నానని, ఎవరికీ అన్యాయం చేయోద్దనేది, నిజాయితీగా ఉండాలనే నేర్చుకున్నానని, కానీ ఆయన చుట్టూ కొందరు చేరి గొడవలు పెడుతున్నారని ఆరోపించారు మనోజ్‌.

ఈ క్రమంలో తాజాగా సోమవారం మీడియాతో ముచ్చటించారు మంచు మనోజ్‌. తండ్రి గురించి మరోసారి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మిన వాళ్లని బాగా చూసుకోవడం, పదిమందికి హెల్ప్ చేయడం నాన్న నుంచి నేర్చుకున్నానని తెలిపారు.

నాన్న మోహన్‌ బాబు జర్నీ స్ఫూర్తిదాయకం, ఆయనే నా హీరో

నాన్న కష్టపడుతూ పైకి వచ్చారు. విద్యాసంస్థలను స్థాపించారు. దాన్ని ఇంతటి స్థాయికి తీసుకొచ్చారు, దాని కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని, ఆయన ప్రయాణం తనకు స్ఫూర్తిదాయకం అన్నారు మనోజ్‌. నిజాయితీగా ఉండటం నాన్న నుంచే నేర్చుకున్నానని, నా వరకు మా నాన్నే నా హీరో అని స్పష్టంచేశారు మంచు మనోజ్‌.

అన్న మంచు విష్ణుపై మనోజ్‌ సెటైర్లు 

అయితే ఈ ఇంటర్వ్యూలో అన్న మంచు విష్ణు నుంచి ఏం నేర్చుకున్నారనే ప్రశ్న తలెత్తింది. దీనికి మనోజ్‌ స్పందిస్తూ, విషయాలను ఎలా సెట్‌ చేయాలో, ఎలా మాట్లాడి మ్యానేజ్‌ చేయాలో ఆయన్నుంచి నేర్చుకోవాలనుకుంటున్నా అని సెటైర్లు పేల్చాడు మనోజ్‌. 

మరో సందర్భంగా తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరం కావడం గురించి చెబుతూ, `మా`లో తనకు సభ్యత్వం ఇవ్వలేదని కామెంట్‌ చేశారు. ప్రస్తుతం మనోజ్‌ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

`భైరవం` నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది

`భైరవం` చిత్రంలో తన పాత్ర గురించి చెబుతూ, గజపతి వర్మ పాత్రలో కనిపిస్తాను. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు. చాలా ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ క్యారెక్టర్. 

`భైరవం` తప్పకుండా నా కెరియర్ లో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.ఇందులో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరి స్క్రీన్ స్పేస్ వారిదే, ప్రతి ఒక్కరూ ఫెంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేశారు. డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా రాశారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.

నారా రోహిత్‌ నుంచి ఆ విషయం నేర్చుకున్నా

సాయి నాకు తమ్ముడు లానే వాడు. రోహిత్ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమా వలన మేం ముగ్గురం ఎక్కువ టైం స్పెండ్ చేసాము. కాబట్టి మా మధ్య బాండింగ్ మరింత పెరిగింది. నా పర్సనల్ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా షూటింగ్ కి ఇబ్బంది కలగకుండా జెట్ స్పీడ్ లో చేసుకుంటూ వెళ్ళాం. ఇది కూడా రోహిత్ నుంచి ఇన్స్పిరేషన్ గా వచ్చింది.

 ఇందులో సాంగ్ చేస్తున్న సమయంలో ఆయన కుటుంబంలో ఒక విషాదం చోటుచేసుకుంది. ఆయన ఆ బాధలోనే షూటింగుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా పాటని ఫినిష్ చేశారు. రియల్లీ హాట్సాఫ్. డైరెక్టర్ విజయ్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లా అయిపోయారని తెలిపారు మనోజ్‌. శ్రీ చరణ్‌ పాకాల బీజీఎం అదిరిపోయిందని, సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందన్నారు.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్