మంచు విష్ణుతో గొడవపై స్పందించిన మనోజ్.. ఏమన్నారంటే..

Published : Mar 27, 2023, 11:50 AM ISTUpdated : Mar 27, 2023, 12:10 PM IST
మంచు విష్ణుతో గొడవపై స్పందించిన మనోజ్..  ఏమన్నారంటే..

సారాంశం

ప్రముఖ  సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే మంచు విష్ణుతో వివాదంపై తాజాగా మంచు మనోజో స్పందించారు. 

ప్రముఖ  సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మంచు విష్ణుకు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసిన అతని సోదరుడు మనోజ్.. ‘‘ఇళ్లలోకి వచ్చి ఇలా కొడుతుంటాడు మా వాళ్లను, బంధువులను.. ఇది సిచ్యువేషన్’’ అని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ వీడియోను మనోజ్ తన సోషల్ మీడియా నుంచి తొలగించాడు. అయితే ఆ వీడియో తెగ వైరల్‌ కావడంతో.. మంచు సోదరుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. 

అయితే ఈ వివాదంపై స్పందించిన మంచు మనోజ్.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ విషయం గురించి తనను అడగవద్దని అన్నారు. తాను కొత్త జీవితం ప్రారంభించానని.. అందరి ఆశీస్సులు కావాలని అన్నారు. తనకు సినిమాలే జీవితం అని పేర్కొన్నారు. 

అయితే.. ఇటీవల మంచు ఫ్యామిలిలో జరిగిన గొడవలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. గతంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న మంచు సోదరులు.. విష్ణు, మనోజ్ మధ్య మనస్పర్థలు ఉన్నట్లు ఇటీవలి ఘటనతో స్పష్టంగా అర్థం అయింది. మంచు విష్ణు తన అనుచరులు బంధువులపై దాడికి దిగుతున్నాడు అంటూ మనోజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికి తెలిసిందే. 

అయితే మనోజ్, విష్ణు మధ్య జరిగిన సంఘటన ప్రతి ఫ్యామిలిలో ఉండే చిన్న చిన్న వివాదాలే అని మంచు ఫ్యామిలీ వివరణ ఇచ్చుకుంది. మోహన్ బాబు, కుటుంబ పెద్దలు ఇన్వాల్వ్ అయి అన్నదమ్ముల వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి