అచ్చు 'తేరి' విలన్ లాగే మంత్రి మల్లారెడ్డి, హరీష్ శంకర్ ప్లాన్ అదే.. పవన్ మూవీపై దారుణంగా ట్రోలింగ్

Published : Mar 27, 2023, 11:48 AM IST
అచ్చు 'తేరి' విలన్ లాగే మంత్రి మల్లారెడ్డి, హరీష్ శంకర్ ప్లాన్ అదే.. పవన్ మూవీపై దారుణంగా ట్రోలింగ్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల లైనప్ ఎక్కువగానే ఉంది. పవన్ ప్రస్తుతం వినోదయ సిత్తం రీమేక్, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల లైనప్ ఎక్కువగానే ఉంది. పవన్ ప్రస్తుతం వినోదయ సిత్తం రీమేక్, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ఓజి, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. 

వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కమిటైన ఎన్ని చిత్రాలు పూర్తి చేస్తారో తెలియదు. అయితే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ 90 రోజుల కాల్ షీట్స్ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంపై మొదటి నుంచి అభిమానుల్లో కాస్త నిరాశ ఉంది. పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్స్ చేస్తుండడంతో అభిమానులు విసిగిపోయారు. 

పవన్ తో సినిమా చేయాలనుకునే దర్శకులు ఇకపై రీమేక్స్ తో వెళ్ళొద్దని ఫ్యాన్స్ రిక్వస్ట్ చేయడం కూడా చూశాం. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రీమేక్ చిత్రమే అనే వార్తలు వస్తుండడంతో ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. తమిళంలో విజయ్ సూపర్ హిట్ మూవీ తేరి చిత్రాన్ని హరీష్ రీమేక్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇటీవల తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇటీవల మేమ్ ఫేమస్' చిత్ర వేడుకలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ చిత్రంలో విలన్ గా నటించాలని తనని గంటన్నర సేపు బతిమాలినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కానీ తానూ విలన్ గా నటించనని మల్లారెడ్డి తేల్చి చెప్పారు. 

మల్లారెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఎందుకంటే తేరి చిత్రంలో విలన్ గా నటించిన మహేంద్రన్ కి.. మల్లారెడ్డికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ చూడడానికి ఒకే విధంగా ఉన్నారు. బహుశా అది గమనించిన హరీష్ శంకర్ విలన్ రోల్ కోసం మల్లారెడ్డిని రిక్వస్ట్ చేసి ఉండొచ్చు. దీనితో తేరి రీమేక్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. నిరాశతో హరీష్ శంకర్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. 

పవన్ చివరగా నటించిన భీమ్లా నాయక్ కూడా రీమేక్ చిత్రమే. ఇప్పుడు నటిస్తున్న వినోదయ సిత్తం కూడానా రీమేక్. పవన్, హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ కూడా దబంగ్ కి రీమేక్. ఇప్పుడైనా స్ట్రైట్ స్టోరీతో వస్తాడనుకుంటే రీమేక్ తో నీరుగార్చుతున్నాడు అంటూ ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని ఒక రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. అయితే ఇది పూర్తిగా పవన్ నిర్ణయం అయి ఉండొచ్చు. సమయం కలసి వచ్చేందుకు పవన్ ఎక్కువగా రీమేక్ చిత్రాలు ఎంచుకుంటున్నారు. 

అందుతున్న సమాచారం మేరకు ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిగా రీమేక్ కాదు. హరీష్ గతంలో పవన్ కోసం భవదీయుడు భగత్ సింగ్ అనే స్ట్రైట్ స్టోరీ రాసుకున్నారు. ఇప్పుడు దాంట్లో కేవలం తేరి ప్లాట్ మాత్రమే చేర్చి కొత్త కథగా మార్చినట్లు తెలుస్తోంది. తేరి చిత్రంలో అంశాలు ఉన్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ అనే ఫీలింగ్ ఇవ్వదని సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా