'కియా మోటార్స్'పై మంచు మనోజ్ కామెంట్స్!

Published : Jan 30, 2019, 04:36 PM IST
'కియా మోటార్స్'పై మంచు మనోజ్ కామెంట్స్!

సారాంశం

'కియా మోటార్స్' ఏపీకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వర్షాభావం తక్కువగా ఉన్న అనంతపూర్ లో దీనిని నెలకొల్పడం కారణంగా అక్కడి ప్రాంతవాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తన పోస్ట్ లో రాసుకొచ్చారు

'కియా మోటార్స్' ఏపీకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వర్షాభావం తక్కువగా ఉన్న అనంతపూర్ లో దీనిని నెలకొల్పడం కారణంగా అక్కడి ప్రాంతవాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తన పోస్ట్ లో రాసుకొచ్చారు.

'కియా మోటార్స్' మొదటి వెహికల్ మన ఏపీలో తయారు చేయడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోందని మంచు మనోజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని ఏపీకి తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి బిగ్ చీర్స్ అని అన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇదొక విజ్ఞతతో కూడిన ముందడుగు అంటూ ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ సినిమాల గురించి మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అలానే అభివృద్ధి పథకాల గురించి కూడా సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఉంటారు.  

PREV
click me!

Recommended Stories

రాజా సాబ్ 15వ రోజు కలెక్షన్స్, ప్రభాస్ సినిమా ఎన్ని లక్షలు వసూలు చేసిందంటే?
4 ఆటలతో 3 ఏళ్లు నాన్ స్టాప్ గా ఆడిన బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?