నిధి అగర్వాల్ మరీ ఇంత చీపా..?

Published : Jan 30, 2019, 03:54 PM IST
నిధి అగర్వాల్ మరీ ఇంత చీపా..?

సారాంశం

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బాగా ఉందనే చెప్పాలి. కొత్త భామలు వస్తున్నా.. రెండు, మూడు సినిమాల తరువాత కనిపించడం లేదు. రీసెంట్ గా టాలీవుడ్ కి పరిచయమైంది నిధి అగర్వాల్. 

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బాగా ఉందనే చెప్పాలి. కొత్త భామలు వస్తున్నా.. రెండు, మూడు సినిమాల తరువాత కనిపించడం లేదు. రీసెంట్ గా టాలీవుడ్ కి పరిచయమైంది నిధి అగర్వాల్. చైతుతో 'సవ్యసాచి', అఖిల్ తో 'మిస్టర్ మజ్ను' సినిమాలు తీసిన ఈ బ్యూటీ వరుస ఫ్లాప్ లు అందుకుంది.

అటువంటి ఈ హీరోయిన్ ని పూరి జగన్నాథ్ తన 'ఇస్మార్ట్ శంకర్'సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా ఇచ్చేశాడు. ఓ ఫ్లాప్ హీరోయిన్ ని తీసుకోవడం వెనుక పూరి ప్లాన్ ఏమై ఉంటుందా..? అని ఆరా తీయగా.. రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే మిగిలిన వారికంటే నిధి అగర్వాల్ చాలా చీప్ గానే వస్తుందట.

పూరి నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్న దగ్గర నుండి కాస్ట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే తక్కువ రేటుకి వచ్చే హీరోయిన్లనే ఎంపిక చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఈసారి నిధి అగర్వాల్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నప్పటికీ నిధి అగర్వాల్ తక్కువ రెమ్యునరేషన్ కి వస్తుండడంతో ఆమెనే ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా.. నిధి సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి!
  

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan OG2: పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ
Ananya Nagalla: యోగా డే విన్యాసాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అనన్య నాగళ్ళ.. ఫోటోస్, వీడియోస్ వైరల్