ఒక్కటైన మంచు మనోజ్, భూమా మౌనిక.. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న కొత్త జంట

Published : Mar 03, 2023, 10:35 PM IST
ఒక్కటైన మంచు మనోజ్, భూమా మౌనిక.. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న కొత్త జంట

సారాంశం

మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో పెళ్లి ఏర్పాట్లపై సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.

మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో పెళ్లి ఏర్పాట్లపై సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న మంచు మనోజ్, మౌనిక వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయ్యారు. 

నేడు శుక్రవారం రాత్రి 8.30 గంటలకు వారి పెళ్ళికి ముహూర్తం ఖరారైంది. ఘనంగా జరిగిన వివాహ వేడుకలో మౌనిక, మనోజ్ ఒక్కటయ్యారు. దంపతులుగా వారి ప్రయాణం ఇక మొదలు కానుంది. వీరి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంగారు వర్ణంలో ఉన్న వస్త్రాల్లో నవదంపతులు ఇద్దరూ మెరిసిపోతున్నారు. 

మౌనికకి మనోజ్ ప్రేమగా ముద్దు ఇవ్వడం ఈ ఫొటోలో చూడవచ్చు. మంచు మనోజ్, భూమా మౌనిక ఇద్దరూ రెండు బలమైన కుటుంబాల నుంచి రావడంతో వీరి వివాహం పై అందరిలో ఆసక్తి నెలకొంది. మంచు మనోజ్ వివాహానికి అతని సోదరుడు మంచు విష్ణు దంపతులు కూడా హాజరయ్యారు. ఇతర సన్నిహితులు, బంధువులు కొద్ది మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. 

ఇది మౌనిక, మంచు మనోజ్ ఇద్దరికీ రెండవ వివాహమే.  2015లో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే యువతని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని రోజులకే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో ఇద్దరూ విడిపోయారు. ఇక భూమా మౌనిక విషయానికి వస్తే ఆమె గతంలో  బెంగుళూరుకి చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు.

ఏది ఏమైనా మంచు మనోజ్ తన కొత్త జీవితాన్ని మౌనికతో ప్రారంభించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 OTT Movies: ఓటీటీలో టాప్ 5 రీసెంట్ బెస్ట్ మూవీస్.. ఆ ఒక్క మూవీని భార్య భర్తలు అస్సలు మిస్ కాకండి
సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?