నేను కష్టాల్లో ఉన్నప్పుడు సమంత ఏం చేసిందంటే.. ఆ వేధింపులు గుర్తు చేసుకుంటూ చిన్మయి కామెంట్స్

Published : Mar 03, 2023, 09:29 PM IST
నేను కష్టాల్లో ఉన్నప్పుడు సమంత ఏం చేసిందంటే.. ఆ వేధింపులు గుర్తు చేసుకుంటూ చిన్మయి కామెంట్స్

సారాంశం

సమంత, చిన్మయి ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. సమంత స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంటే.. చిన్మయి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించింది.

సమంత, చిన్మయి ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. సమంత స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంటే.. చిన్మయి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించింది. సమంత నటించిన అత్యధిక చిత్రాలకు ఆమెకి చిన్మయి డబ్బింగ్ చెప్పింది. చాలా సినిమాల్లో సమంత నుంచి వచ్చే క్యూట్ క్యూట్ మాటలు చిన్మయివే. 

అయితే ఇటీవల వీరిద్దరూ ఒడిదుడుకులు ఎదురుకొన్నారు. సమంత అటు వ్యక్తిగత జీవితంతో, ఇటు ఆరోగ్య సమస్యలతో సతమతమైంది. ఇప్పుడు కోలుకుని తిరిగి సినిమాల్లో నటిసస్తోంది. అలాగే చిన్మయి కూడా ఆ మధ్యన మీటూ ఉద్యమ సమయంలో సీనియర్ రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొంతమంది చిన్మయికి మద్దతు తెలిపారు. కానీ కోలీవుడ్ లో అత్యధికులు వైరముత్తు వైపు నిలబడ్డారు. చిన్మయిని బ్యాన్ చేసారు కూడా. 

ఆ కష్టాలని చిన్మయి గుర్తు చేసుకుంటూ సమంతపై తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా సమంత నిలబడింది. ధైర్యాన్ని ఇచ్చింది. మీటూ సమయంలో నేను పని కోల్పోయాను. కానీ సమంత నాకు పని కల్పించి ఆదుకుంది అని చిన్మయి తెలిపింది. నాకు అన్నివేళలా అండగా ఉన్న వ్యక్తి సమంత మాత్రమే అని చిన్మయి పేర్కొంది. 

చిన్మయి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. అలాగే శాకుంతలం చిత్రం కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. సమంత తొలి చిత్రం ఏ మాయ చేసావే నుంచి ఆమెకి చిన్మయినే డబ్బింగ్ చెప్పేది. కానీ ఇటీవల నుంచి సమంత తన చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. దీనితో సమంత, చిన్మయి మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇటీవల చిన్మయి.. సమంతపై తనకి ఉన్న గౌరవాన్ని చాటుకుంటోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి