ఎన్టీఆర్ కోసం ఒకరి చేయి విరగ్గొటిన మంచు మనోజ్.. ఎందుకు చేశారంటే మాత్రం..!

Published : Sep 26, 2018, 12:32 PM IST
ఎన్టీఆర్ కోసం ఒకరి చేయి విరగ్గొటిన మంచు మనోజ్.. ఎందుకు చేశారంటే మాత్రం..!

సారాంశం

ప్రస్తుతం ఉన్న హీరోలతో పోలిస్తే మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతూ వారితో టచ్ లో ఉంటాడు. అంతేకాదు.. స్నేహానికి చాలా ప్రాముఖ్యతనిస్తాడు. 

ప్రస్తుతం ఉన్న హీరోలతో పోలిస్తే మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతూ వారితో టచ్ లో ఉంటాడు.

అంతేకాదు.. స్నేహానికి చాలా ప్రాముఖ్యతనిస్తాడు. ఇటీవల మరణించిన హరికృష్ణ అంత్యక్రియల సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల కోసం బౌన్సర్ లా మారి నందమూరి అభిమానుల మన్ననలు పొందారు.

తారక్ కోసం మంచు మనోజ్ చిన్నప్పుడు ఓ సాహసం కూడా చేశాడట. ఎన్టీఆర్ ని చిన్నప్పుడు ఎవరో కొడితే.. మనోజ్ వెళ్లి కొట్టినవాడి చేయి విరగ్గొట్టాడట. ఈ స్టోరీ ఏంటో చెప్పమని ఓ అభిమాని మంచు మనోజ్ ని రిక్వెస్ట్ చేశాడు.

దీనిపై స్పందించిన మనోజ్.. ''ఈ విషయం తారక్ నే అడుగు. నాకంటే తనే బాగా చెప్తాడు'' అంటూ వెల్లడించాడు. దీంతో అభిమానులకి ఈ స్టోరీపై ఆసక్తి పెరిగి దీని గురించి చెప్పమని ట్విట్టర్ ద్వారా ఇద్దరి హీరోలని రిక్వెస్ట్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్
Alpha OTT Release: ఆలియా 'ఆల్ఫా' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?