ఎన్నికల బరిలోకి ఎన్టీఆర్..!

Published : Sep 26, 2018, 11:54 AM ISTUpdated : Sep 26, 2018, 12:35 PM IST
ఎన్నికల బరిలోకి ఎన్టీఆర్..!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫైట్ సీన్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫైట్ సీన్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త వినిపిస్తోంది. అదే ఎన్నికల ఎపిసోడ్.. ఎవరూ ఊహించని విధంగా అరవింద సమేతలో ఎలెక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశాడట త్రివిక్రమ్.

ఎన్టీఆర్ పై చిత్రీకరించిన స్థానిక ఎన్నికల ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. సదరు సన్నివేశాల్లో త్రివిక్రమ్ తన మార్క్ డైలాగులతో చెలరేగిపోయాడని సమాచారం. ఎన్టీఆర్ కూడా తన నట విశ్వరూపంతో అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎలెక్షన్ ఎపిసోడ్, రాయలసీమ యాస, ఎమోషనల్ సాంగ్స్ ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఆర్-త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేలానే ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఐదో పాట చిత్రీకరణ ఇటలీలో జరుగుతోందని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్