
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు తల్లి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె తిరుపతిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించారు. తల్లి మరణవార్త విని మోహన్ బాబు కుటుంబసభ్యులు తిరుపతికి బయలుదేరారు.
శుక్రవారంనాడు ఆమె అంత్యక్రియలు జరగనున్నారు. తన నానమ్మ మరణవార్త విని మంచు మనోజ్ దిగ్బ్రాంతికి గురయ్యారు. 'మా నానమ్మ లక్ష్మమ్మ దేవుడి దగ్గరకి వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్ అవుతాం నానమ్మ. ఈ సమయంలో మేము భారతదేశంలో లేకపోవడం మరింత బాధని కలిగిస్తోంది. ఇది అనుకోకుండా జరిగిపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నారు.
సంబంధిత వార్త..