నా గోల్ అదే.. మంచు మనోజ్ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Nov 3, 2018, 10:58 AM IST
Highlights

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ మధ్య కాలంలో సినిమాల గురించి కాకుండా ఇతర విషయాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో ఓ లెటర్ రాశాడు. అది చదివిన వారంతా.. ఈ హీరో పాలిటిక్స్ లోకి వెళ్ళబోతునన్నాడని అనుకున్నారు.

ఇదే విషయమై ఆయన్ని ప్రశ్నించగా.. ప్రజలకి ఏదో చేయాలనుకుంటున్నానని రాజాకీయాల రంగు పూయకండని అన్నారు. అయితే అసలు మంచు మనోజ్ ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలని అనుకున్న ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఆయన్నే ప్రశ్నించాడు.

నీ ప్లాన్ ఏంటి..? గోల్ ఏంటి..? అంటూ మనోజ్ ని ప్రశ్నించగా.. దానికి సమాధానంగా.. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే..? నేనున్న చోట స్పోర్ట్స్, ఉచిత ఆహారం లేదంటే తాగునీటి సదుపాయం కల్పించాలనేది నా గోల్ అని వెల్లడించాడు.

ఆ తరువాత ఓ ఖాళీ ప్రదేశంలో తీసుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. 'పేద విద్యార్ధులు, రైతుల కోసం ఏదో చేయాలన్న నా కల ఈ ఖాళీ ప్రదేశం ద్వారా నెరవేరబోతుంది. ఇక్కడ ఏదోకటి ప్రారంభించాలి' అంటూ ట్వీట్ చేశారు. 

ఇవి కూడా చదవండి.. 

శబరిమల వివాదంపై మంచు మనోజ్ కామెంట్!

ఎన్టీఆర్ పై మంచు మనోజ్ కామెంట్స్!

పవన్ పార్టీలోకి మంచు మనోజ్..?

రాజకీయాలకి లింక్ చేయకండి: మంచు మనోజ్

మనోజ్ కొత్త జర్నీ.. ప్రపంచమంతా విస్తరింపజేస్తాడట! 

మంచు మనోజ్ 'లేఖ' వెనక అసలు స్కెచ్ ఇదా?

click me!