కమల్ ఫ్యామిలీ షాక్: అక్షరహాసన్ ప్రెవేట్ ఫొటోలు లీక్‌!

By Udayavani DhuliFirst Published Nov 3, 2018, 10:41 AM IST
Highlights

సెలబ్రెటీల ప్రెవేట్ ఫొటోలు లీక్ అవటం అనేది హాలీవుడ్ లో రెగ్యులర్ గా జరుగుతూంటుంది. అయితే మన దేశంలో అలాంటి సంఘటనలు అడపా,దడపా జరుగుతాయి కానీ చాలా తక్కువనే చెప్పాలి. 

సెలబ్రెటీల ప్రెవేట్ ఫొటోలు లీక్ అవటం అనేది హాలీవుడ్ లో రెగ్యులర్ గా జరుగుతూంటుంది. అయితే మన దేశంలో అలాంటి సంఘటనలు అడపా దడపా జరుగుతాయి కానీ చాలా తక్కువనే చెప్పాలి. ఈ మధ్యన అమీ జాక్సన్ ప్రెవేట్ ఫొటోలు...ఇప్పుడు అక్షరాహాసన్ ..ప్రెవేట్ ఫొటోలు లీక్ అయ్యి ఇంటర్నెట్ లో వైరల్ గా మారి వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాయి. 

తన ప్రెవేట్ రూమ్ లో  తీసుకున్న సెల్ఫీలు ఎలా బయటకు వచ్చి సోషల్ మీడియాలో షేర్ అయ్యాయో ఫ్యాన్స్ కు అర్దం కావటం లేదు. అయితే ఈ ఫొటోలు మార్ఫింగ్ అని కొందరంటున్నారు. కానీ ఈ విషయమై ఆమెను కలిసి స్పందన తీసుకోవటానికి మీడియా ప్రయత్నం చేసింది కానీ ఫలించలేదు. 

కెరీర్ విషయానికి వస్తే..

శ్రుతిహాసన్, అక్షరహాసన్ యూనివర్శిల్ యాక్టర్ కమలహాసన్ వారసులన్న విషయం తెలిసిందే. శృతిహాసన్ మన తెలుగులోనూ సినిమాలు చేసి విజయం సాధించి, ప్రస్తుతం బ్రేక్ తీసుకుని సింగర్ గా, సంగీత దర్శకురాలిగా తనను తాను ప్రూవ్ చేసుకునే బిజీలో ఉంది. మరో ప్రక్క  అక్షరహాసన్ కూడా అక్క బాటలోనే పయనించే విధంగా తన నట జీవితాన్ని బాలీవుడ్ నుంచే మొదలెట్టారు.

 షమితాబ్ అనే హిందీ చిత్రంలో ఏకంగా బిగ్‌బీతోనే నటించారు. అందులో కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ కూడా నటించారు. అయితే మంచి చిత్రం అంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది గానీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు.

దీంతో తన తొలి చిత్ర రిజల్ట్‌ను పెద్దగా ఆశించిన అక్షరకు నిరావనే మిగిలింది. మంచి చిత్రం కన్నా మంచి విజయమే పేరుకు, మరిన్ని అవకాశాలకు దోహదం చేస్తుందన్నది జీర్ణించుకోలేని నిజం. అక్షర విషయంలోనూ అదే జరిగింది. షమితాబ్ తరువాత మరో అవకాశం రాలేదు. 

తాజాగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.  అయితే ఈ అవకాశం అక్షరకు శాండిల్‌వుడ్‌లో రావడం విశేషం. కన్నడంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్‌ వారసుడు విక్రమ్‌ చంద్రన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో అక్షర ఆయనకు జంటగా నటించనున్నారని  సమాచారం. 

click me!